విమానం లో గాలి ఆడట్లేదని కిటికీలు తెరిచాడు...తర్వాత ఏమైందో తెలుస్తే షాక్.?

విమానం లో కిటికీలు తీయడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా.? ఎర్ర బస్ ఎక్కినట్టుగానే ఎయిర్ బస్ ఎక్కి ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు.

విమానం ఎక్కాక కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాల్సిందే.అందుకే విమానం ఎక్కగానే విమాన సిబ్బంది ప్రయాణించేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులను వివరంగా చెప్తారు.

దానికి సంబంధించిన బ్రోచర్స్ కూడా ఇస్తారు.అందరూ ఆ నియమాలను పాటించి తీరాలి.

ఏ చిన్నపొరపాటు చేసినా గాల్లో ప్రాణాలు గాల్లోనే కలిసిపోతాయి.నియమాలు,నిబంధనలు చెప్పినప్పటికూ కూడా ఓ ప్రయాణికుడు విమానంలో గాలి ఆడటంలేదని ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు…తర్వాత ఏమైందో తెలుసా.

? Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చైనాకు చెందిన 25ఏండ్ల యువకుడు విమానంలో గాలి ఆడటంలేదని టేక్‌ఆఫ్ అవుతున్న సమయంలో ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు.

దీంతో ఆ ఎమర్జెన్సీ డోర్ పూర్తిగా ఊడి వచ్చి కింద పడిపోయింది.దాంతో హతాశుడవ్వడం ఆ యువకుడి వంతైంది.

మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా డోర్‌ను ఓపెన్ చేసాడని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.15 రోజుల జైలు శిక్షతో పాటు 70 వేల యువాన్‌ల ఫైన్ కూడా విధించారు.

అంటే మన కరెన్సీలో ఎంతనుకున్నారు దాదాపు ఏడున్నర లక్షలు అన్నమాట.ఈ విచిత్రమైన ఘటన చైనాలోని మియాన్యాంగ్ నంజియా ఎయిర్‌పోర్ట్‌లో ఏప్రిల్ 27న చోటు చేసుకున్నది.

!--nextpage Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ చైనాలో ఇలా విమానంలో బీభత్సం సృష్టించడం ఇదే కొత్తేమీ కాదు.

2014లో ఇలాగే ఓ డొమెస్టిక్ విమానంలో ఓ ప్యాసెంజర్ ఎమర్జెన్సీ డోర్ ఓపెన్ చేశాడు.

2017లో ఓ ప్రయాణికురాలు విమానం ఇంజన్‌లో కాయిన్స్ వేసింది.ఇక.

ఈ సంవత్సరం జనవరిలో స్పెయిన్‌లో ఓ వ్యక్తి విమానంలో కూర్చొని కూర్చొని బోర్ కొట్టిందని విమానం రెక్క మీదికి పోయి కూర్చున్నాడు.

అప్పుడప్పుడు ఇటువంటి చిలిపి సంఘటనలు విమానాల్లో జరుగుతుంటాయి.ఈ చిలిపి సంఘటనలే కొన్నిసార్లు పెద్ద ప్రమాదాలను సృష్టిస్తాయి.

శంషాబాద్ ఎయిర్‎పోర్టు వద్ద ఆపరేషన్ చిరుత సక్సెస్..!