వైఫ్‌కి తెలియకుండా నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్‌ని మెయింటైన్ చేస్తున్న చైనీస్ వ్యక్తి… చివరికి..?

సాధారణంగా పెళ్లైన వారు తమ భార్యను తప్ప మరొక మహిళకు తమ మనసులో చోటు ఇవ్వరు.

కొంతమంది మాత్రం భార్య దగ్గర సంతృప్తి పొందలేక వేరే మహిళతో సంబంధాలు పెట్టుకుంటారు.

కానీ అది ఎంత పెద్ద తప్పో చివరికి తెలుసుకొని పశ్చాత్తాప పడుతుంటారు.అయితే ఒక చైనీస్ వ్యక్తి( Chinese Man ) పెళ్లయ్యి అతని భార్య ఉన్నా సరే ఆమెను కాదని ఏకంగా నలుగురు మహిళలతో ఏకకాలంలో ప్రేమాయణం నడిపించాడు.

ఆ విషయం కాస్త బయటపడింది.ఇప్పుడు ఈ ఆశ్చర్యకరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ నలుగురు మహిళలు అందరూ ఒకే అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో నివసిస్తున్నారు.అంతేకాదు, వారిలో ఒకరు ఆయన భార్య నివసించే భవనంలోనే ఉంటుంది.

ఈ రహస్యం నాలుగు సంవత్సరాలకు పైగా కొనసాగింది.ఈ విషయం తెలిసి ఇప్పుడు చైనాలోని ప్రజలు షాక్ అవుతున్నారు.

చైనాలోని జిలిన్( Jilin ) ప్రాంతానికి చెందిన ఒక యువకుడు, తనను తాను ధనవంతుడిగా చూపించి తన భార్యను మోసం చేసిన సంఘటన ఇది.

ఆ యువకుడు చాలా పేద కుటుంబంలో పుట్టి, హైస్కూల్ చదువు మధ్యలోనే మానేసాడు.

"""/" / అయినప్పటికీ, తన భార్యని మోసం చేయడానికి తను ఒక ధనవంతుడి కుమారుడు అని నటిస్తూ వచ్చాడు.

నిజానికి, అతని తల్లి చిన్న పని చేసేది, తండ్రి అప్పుడప్పుడు కూలీ పనులు చేసేవాడు.

కానీ భార్యకు తన తల్లిదండ్రులు పెద్ద వ్యాపారవేత్తలు అని అబద్ధం చెప్పాడు.ఆమెను ఆకట్టుకోవడానికి ఆన్‌లైన్‌లో కొన్న నకిలీ బహుమతులు( Fake Gifts ) ఇచ్చేవాడు.

ఆమె గర్భం దాల్చిన తర్వాత వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. """/" / భార్య అతని నిజమైన ఆర్థిక పరిస్థితి తెలిసిన తర్వాత, విడాకులు ఇవ్వాలని నిర్ణయించుకోలేదు.

బదులుగా, ఆమె తమ బిడ్డను ఒంటరిగా పెంచుకోవాలని నిర్ణయించుకుని అతన్ని ఇంటి నుంచి వెళ్లమని చెప్పింది.

అనంతరం, ఈ మోసగాడు మరొక మహిళను ఆన్‌లైన్‌లో కలిశాడు.ఆమెను మోసం చేసి ఆమె నుంచి 1,40,000 యువాన్లు అప్పు తీసుకున్నాడు.

ఆ తర్వాత ఆమెతో కలిసి ఉండటానికి దగ్గరలోని అపార్ట్‌మెంట్‌ని అద్దెకు తీసుకున్నాడు.అంతేకాదు, ఆయన మరో ముగ్గురు మహిళలతో కూడా ప్రేమ సంబంధం కొనసాగించాడు.

వారిలో ఇద్దరు కాలేజీ స్టూడెంట్స్, ఒకరు నర్స్.ఈ గర్ల్‌ఫ్రెండ్స్‌ నుంచి కూడా డబ్బులు తీసుకున్నాడు.

ఒక ప్రియురాలు అతడు మోసం చేస్తున్నాడని గ్రహించింది.పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని బాగోతం మొత్తం బహిర్గతం అయింది దాంతో ఇప్పుడు జైలుకు తరలించారు.

బాలయ్య బాబు ప్రయోగత్మాకమైన సినిమాలు చేయలేడా..?