ధనవంతులను ఎలా పెళ్లి చేసుకోవాలో ఐడియాలు ఇస్తూ.. కోట్లు సంపాదిస్తోంది..!
TeluguStop.com
చైనా( China )లో ఒక మహిళ 'లవ్ గురు'గా పేరు తెచ్చుకుని సంచలనం సృష్టిస్తోంది.
ఈమె పేరు లె చువాన్కు ( Le Chuanqu ), అలియాస్ క్వాకు బిగ్ వుమన్ ( Ququ Big Woman ).
ఈమె ధనవంతులను పెళ్లి చేసుకునేలా అమ్మాయిలకు కొన్ని మార్గాలను టీచ్ చేస్తోంది.ఈ లవ్ గురు లైవ్ స్ట్రీమింగ్ ద్వారా తన బోధనలను ప్రజలకు అందిస్తోంది.
ప్రతిఫలంగా ఆమె ఏడాదికి సుమారు 19 మిలియన్ అమెరికన్ డాలర్లు (సుమారు రూ.
163 కోట్లు) సంపాదిస్తుంది.ఆమె పెళ్లిని ఆర్థికంగా ఎదగడానికి ఒక అవకాశంగా చూస్తోంది.
ధనవంతులను పెళ్లి చేసుకోవడం ద్వారా తమ జీవితంలో ఆర్థిక లాభాన్ని పొందడం ఎలాగో మహిళలకు బోధిస్తుంది.
"""/" /
లె చువాన్( Le Chuanqu )కు పాఠాలు చాలా వివాదాస్పదమైనవి.
చాలా మంది ఆమె కోర్సు అనైతికమైనదని, మహిళలను వస్తువులుగా కన్సిడర్ చేస్తోందని విమర్శించారు.
కొంతమంది మాత్రం ఆమె ఇస్తున్న ఐడియాస్ చాలా యూజ్‌ఫుల్‌గా, ప్రాక్టికల్‌గా ఉన్నాయని అంటున్నారు.
లె చువాన్కు పెళ్లిపై చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఒపీనియన్ ఉంది.ఒక వీడియోలో ఆమె మాట్లాడుతూ "అన్ని సంబంధాలు చివరికి బెనిఫిట్స్ ఎక్స్ఛేంజ్ గురించే.
మన ప్రయోజనాన్ని పెంచుకోవడానికి అన్ని మార్గాలను ఉపయోగించాలి." అని తెలిపింది.
"""/" /
ఆమె సలహాల ప్రకారం ఒక రిలేషన్షిప్లో ప్రవేశించిన వెంటనే దానిని వదిలివేయకూడదు.
ధనవంతులతో కొంత సమయం గడపడం చాలా ముఖ్యం.వారితో దీర్ఘకాలిక లక్ష్యాల గురించి మాట్లాడాలి.
ధనవంతులైన ప్రియుడితో ఉండటం మంచిది, వారిని దీర్ఘకాలిక పార్ట్నర్ భావించాలి.ఈ లవ్ గురు లైవ్ స్ట్రీమ్స్ లో పాల్గొనే వారి నుంచి చాలా డబ్బులు తీసుకుంటుంది ఇక పర్సనల్ గా కలవాలంటే ఇంకా ఎక్కువ ఆమెకు ఇచ్చుకోవాల్సిందే మరి ఆమె కోర్సు ద్వారా ఎంతమంది అమ్మాయిలు ధనవంతులను పెళ్లి చేసుకున్నారో తెలియ రాలేదు.
వైరల్ వీడియో: విజయం అంటే ఇది.. అమ్మ కళ్లలో ఆనంద బాష్పాలు..