యాక్! ఫుడ్ ఐటమ్‌లో బతికున్న పురుగులు ఫీల్ చేస్తున్న చైనీస్ వంటగాడు.. వీడియో!

కొందరు వ్యక్తులు వివిధ వంటకాలు, పదార్థాలతో ఎక్స్‌పరిమెంట్స్‌ చేయడానికి ఇష్టపడతారు, అయితే ఈ ఫుడ్ ఎక్స్‌పరిమెంట్స్‌లో కొన్ని మనల్ని ఆశ్చర్యపరిస్తే మరికొన్ని, అసహ్యాన్ని పుట్టిస్తాయి.

తాజాగా అలాంటి ఒక చెత్త ఫుడ్ ప్రయోగాన్ని ఓ వ్యక్తి చేశాడు.లైవ్ వార్మ్‌లతో అంటే బతికి ఉన్న పురుగులతో మోమోలను ఈ వంటగాడు తయారు చేశాడు.

దానికి సంబంధించిన దృశ్యాలు మీడియాలో వైరల్‌గా మారగా అది చూసి చాలామంది వాంతులు చేసుకుంటున్నారు.

"""/" / మోమోస్ అనేది టిబెట్, నేపాల్‌లో మొదటగా తయారైన ఒక రకమైన డంప్లింగ్.

ఇది అనేక ఆసియా దేశాలలో బాగా పాపులర్ అయిన ఒక డిష్.వాటిని సాధారణంగా ముక్కలు చేసిన మాంసం, జున్ను లేదా కూరగాయలతో ఫిల్ చేసి స్పైసీ సాస్‌లతో వడ్డిస్తారు.

అయితే, ఈ వీడియోలో కుక్ మాత్రం చాలా పురుగులను ఫిల్ చేశాడు.అవి చిన్న, మెలికలు తిరుగుతున్న పురుగులు.

వాటిని చూస్తుంటేనే వాళ్ళు జలదరిస్తోంది.అలాంటివి ఆహారంలో పెట్టి ఇస్తే ఎవరు తింటారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.

"""/" / ఈ వీడియో @chinesestreetfood2023 అనే ఇన్‌స్టాగ్రామ్( Instagram ) ఖాతాలో పోస్ట్ చేశారు, ఇది రియల్ చైనీస్ స్ట్రీట్ ఫుడ్‌( Chinese Street Food )ను ప్రదర్శిస్తుందని పేర్కొంది.

ఆ ఖాతాకు 1.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు, కానీ వారిలో చాలామంది ఈ ప్రత్యేక వీడియో చూసి భయాందోళనకు గురయ్యారు.

ఆ వ్యక్తి పురుగులను మోమో రేపర్‌లలో నింపడం, ఆపై వాటిని వెదురు బుట్టలో ఆవిరి చేయడం వీడియో చూపిస్తుంది.

అతను లోపల వండిన పురుగులను చూపించడానికి మోమోలలో ఒకదాన్ని తెరుస్తాడు.ఈ విచిత్రమైన వంటకం పట్ల అసహ్యం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.

"మనుషులు తినడానికి శాఖాహారాలు ఎన్నో ఉన్నాయి.ఇలాంటి చెత్తే తినాలా?" అని ఒక నెటిజెన్ మండిపడ్డాడు.

రుణమాఫీపై తీపి కబురు అందేనా…?