చైనాకి, గాడిదలు.. కుక్కలు కావాలట... కారణమిదే!

పాకిస్తాన్ - చైనా మధ్యగల అవినాభావ సంబంధం గురించి వేరే చెప్పాల్సిన పనిలేదు.

ఈ క్రమంలోనే తాజాగా చైనా పాకిస్థాన్ నుండి గాడిదల్ని, కుక్కల్ని కొనేందుకు ఆసక్తి కనబరుస్తోంది.

ఆర్థిక కష్టాల్లో ఉన్న పాకిస్తాన్‌ను చైనా ఈ రకంగా ఆదుకోవాలని యోచిస్తోందట.ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇప్పటికే అప్పులపాలైన పాకిస్తాన్‌కు వాటిని తీర్చే శక్తి లేదు.అలాగని కొత్త అప్పు పుట్టే పరిస్థితి కూడా లేదు.

ఆహారం, చమురు కొనడానికి కూడా ఆ దేశం దగ్గర చిల్లిగవ్వ కూడా లేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.

మూలిగే నక్కపైన తాటిపండు పడ్డట్టు ఇటీవలి కాలంలో వరదలు ఆ దేశాన్ని కోలుకోని విధంగా నాశనం చేశాయి.

ఈ నేపథ్యంలో దేశంలో ఆర్థిక వనరులు లేవు.ఈ సమయంలో పాకిస్తాన్‌కు చైనా అండగా నిల్చొని తన స్నేహాన్ని చెటిచెప్పడానికి సిద్ధమైంది.

ఈ క్రమంలోనే పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని తీసుకుని, ఆ దేశానికి నిధులు అందివ్వాలని భావిస్తోంది.

అయితే అవి మాత్రమే ఎందుకు అనే అనుమానం కలగక మానదు. """/" / దీనికి ఓ కారణం ఉంది.

గాడిదలు, కుక్కల చర్మం నుంచి ఎజియావో అనే పదార్థాన్ని తయారు చేస్తారు.ఈ పదార్థాన్ని ఔషధాల తయారీలో వాడుతారట.

పైగా ఇది చాలా ఖరీదైంది.పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదల్ని దిగుమతి చేసుకుంటే దీన్ని ఎక్కువ మొత్తంలో తయారు చేయొచ్చు.

అందుకే ఈ అంశంపై చైనా దృష్టి సారించింది.అయితే, ఈ నిర్ణయం కొత్తదేం కాదు.

గతంలో పాకిస్తాన్ నుంచి కుక్కలు, గాడిదలు, ఒంటెల మాంసం చైనాకు దిగుమతి అయ్యేది.

చాలా ఏళ్ల నుంచే పాక్ తమ దేశం నుంచి జంతువుల్ని చైనాకు ఎగుమతి చేస్తోంది.

మరోవైపు పాక్ నుంచి కొనేబదులు అఫ్ఘనిస్తాన్ నుంచి కొనుక్కుంటే మేలని కొందరు చైనా అధికారులు భావిస్తున్నారట.

సింహాచలం చేరుకున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న సీఎం రమేష్