చైనాలో కదిలించే ఘటన.. 3 ఏళ్లుగా కవల సోదరిలా నటించిన అమ్మాయి!
TeluguStop.com
కెనడాలో( Canada ) నివసిస్తున్న ఓ చైనీస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
ఆనీ నియు( Annie Niu ) అనే 34 ఏళ్ల ఇన్‌ఫ్లుయెన్సర్, తన ట్విన్ సిస్టర్( Twin Sister ) మరణించిన తర్వాత ఏకంగా మూడేళ్ల పాటు ఆమెగానే నటించింది! తన వృద్ధ అమ్మమ్మ, తాతయ్యల మనసు నొప్పించకూడదనే ఉద్దేశంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది.
ఆనీ ఒక లైఫ్‌స్టైల్, ఫుడ్ కంటెంట్ క్రియేటర్.టిక్‌టాక్ లో తన విషాదభరిత కథను పంచుకుంటూ, 2019లో వైరల్ మెనింజైటిస్ కారణంగా తన కవల సోదరి మరణించిందని తెలిపింది.
అయితే, తమ అమ్మమ్మ ఆరోగ్యం దృష్ట్యా ఈ విషయాన్ని ఆమెకు చెప్పకూడదని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు.
కానీ, రెండేళ్ల తర్వాత ఆనీ తన గ్రాండ్ పేరెంట్స్ లో( Grand Parents ) ఒకరికి నిజం చెప్పాల్సి వచ్చింది.
2022లో టిక్‌టాక్ వీడియో ద్వారా ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేసింది.తన సోదరి చనిపోయిన మూడు సంవత్సరాల తర్వాత, అమ్మమ్మ ఆరోగ్యం క్షీణించడంతో అసలు విషయం ఆమెకు చెప్పక తప్పలేదని ఆనీ తెలిపింది.
"""/" /
ఆనీ తన కవల సోదరి మరణ రహస్యాన్ని కుటుంబ సభ్యులకు చెప్పిన తర్వాత జరిగిన పరిణామాలను వివరిస్తూ ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.
డిసెంబర్ 13న చేసిన ఈ పోస్ట్‌లో, నిజం తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న తన సోదరి ఫోటోలన్నిటినీ తీసేసారని తెలిపింది.
"మీ కవల సోదరి ఐదేళ్ల క్రితం చనిపోయిందని కుటుంబానికి చెబితే, వాళ్లు ఆమె ఉన్న ప్రతి ఫోటోనూ తొలగిస్తారు" అంటూ తన బాధను వ్యక్తం చేసింది.
ఈ సంఘటన ఆమెను తీవ్రంగా కలచివేసింది. """/" /
అంతేకాదు, తన సోదరిలాగే మాట్లాడగలిగే ఆనీ, తన అమ్మమ్మ తాతయ్యలను నమ్మించడానికి అదే గొంతుతో మాట్లాడేదాన్ని అని చెప్పింది.
ఈ రహస్యాన్ని దాచిపెట్టడానికి ఆమె ఎంత కష్టపడిందో అర్థం చేసుకోవచ్చు.దురదృష్టవశాత్తు, ఆనీ అమ్మమ్మ 2022, జులైలో మరణించింది.
చివరి క్షణాల్లో ఆనీ తండ్రి తన తల్లిని ఓదారుస్తూ, తన మనవరాలు స్వర్గంలో ఎదురుచూస్తుందని చెప్పడం మరింత విషాదకరమైన అంశం.
చైనాలో( China ) పుట్టిన ఆనీ, తన సోదరితో కలిసి పదేళ్ల వయసులో కెనడాకు వలస వెళ్ళింది.
ఆనీ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఆమె నిర్ణయాన్ని సమర్థిస్తుంటే, మరికొందరు విమర్శిస్తున్నారు.
రేవతి కుటుంబానికి అండగా వేణుస్వామి.. ఈ ఒక్క విషయంలో మెచ్చుకోవాల్సిందే!