సింగపూర్‌ షికారుకి చైనా కుబేరులు క్యూ కడుతున్నారు… దేనికంటే?

అవును, ఇపుడు ప్రపంచం సింగపూర్‌ వైపే చూస్తోంది.సింగపూర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సింగపూర్ ఎంతటి అభివృద్ధి చెందిన దేశమో అందరికీ తెలిసినదే.అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రభావంతమైన దేశం చైనా.

అలాంటి చైనాలో కుబేరులకు కొదువే లేదు.కానీ చైనా బిలియనీయర్స్‌ చూపు మాత్రం ఇపుడు సింగపూర్‌పై పడింది.

వరల్డ్‌ టాప్‌ కంపెనీస్‌ అన్నీ చైనాలో కొలువుదీరాయ్‌, అక్కడే తమ ఉత్పత్తుల్ని ఉత్పత్తి చేస్తున్నాయ్‌.

కానీ, కొన్నాళ్లుగా సీన్‌ రివర్స్ అవుతోంది.ఆయా కంపెనీలు చైనా నుంచి తరలిపోతున్నాయ్‌.

"""/" / చైనా కుబేరులు తమ సొంత దేశం విడిచి వెళ్లిపోతున్నారు.చైనాలోనే ఉంటే తమ సంపదకు ముప్పు వస్తుందని టెన్షన్‌ పడుతున్నారు.

అందుకే, సంపన్నులకు స్వర్గధామమైన సింగపూర్‌కు తరలిపోతున్నారు.ఇన్నాళ్లూ సంపాదించుకున్న డబ్బుతో సింగపూర్‌ ఎంచక్కా చెక్కేస్తున్నారు.

కుటుంబాలతో సహా షిఫ్టైపోతూ అక్కడే తమ వ్యాపార కార్యాలయాలను ఏర్పాటు చేసుకుంటున్నారు వారంతా.

చైనా కుబేరుల్లో ఒకరైన అలీబాబా గ్రూప్‌ జాక్‌మా మాట తూలినందుకు ఆ కంపెనీపై అక్కడి ప్రభుత్వం కక్షగట్టిన సంగతి విదితమే.

"""/" / దాంతో, జాక్‌మా పెద్దఎత్తున సంపదను కోల్పోవడమే కాకుండా, పరాయి దేశం జపాన్‌లో తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇదే పరిస్థితి తమకెందుకు రాదన్న అనుమానం ఇప్పుడు చైనా కుబేరుల్లో మొదలైంది.ఆ భయంతోనే చైనా బిలియనీయర్స్‌ సింగపూర్‌కు మకాం మార్చేస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఇక దానిని నిజం చేసింది చైనాలో అతిపెద్ద ఫుడ్‌ బిజినెస్‌ కంపెనీ అయినటువంటి హైదిలావ్‌.

హైదిలావ్‌ తన ఆపరేషన్స్‌ను సింగపూర్‌కు షిఫ్ట్‌ చేయడం ఇపుడు ఆ దేశంలో కలకలం రేపుతోంది.

చైనా కుబేరులు సింగపూర్‌ తరలిపోవడానికి అక్కడి కమ్యూనిస్ట్‌ ప్రభుత్వ విధానాలు, అణచివేత ఒక కారణమైతే, అమెరికాతో పెరుగుతోన్న ఉద్రిక్త పరిస్థితులు మరో కారణమంటున్నారు ఆర్ధికవేత్తలు.