చైనా: అందంగా కనిపించాలని ఒకే రోజులో 6 సర్జరీలు చేయించుకుంది.. చివరికేమైందో ఊహించలేరు..!

ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు చాలా అందంగా కనిపించాలనే కోరిక కలిగి ఉంటున్నారు.

దీనిని నెరవేర్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తున్నారు.హానికరమైన కెమికల్స్ కూడా ముఖానికి పూసుకుంటున్నారు.

కొందరైతే ప్రాణాంతకమైన కాస్మోటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు.దక్షిణ చైనాలోని గుయిగాంగ్ (Guigong In Southern China)అనే గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ యువతి 24 గంటల్లోనే ఆరు బ్యూటీ సర్జరీలు చేయించుకుంది.

ఒకే రోజులో ఎన్ని సర్జరీలు చేయడం వల్ల ఆమె బాడీ తట్టుకోలేకపోయింది.అంతే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

ఈ విషాద సంఘటన గురించి తెలుసుకొని అందరూ బాధపడుతున్నారు.ఆమె నన్నింగ్‌లోని ఒక క్లినిక్‌కు ఈ శస్త్రచికిత్సల కోసం వెళ్ళింది.

ఈ చికిత్సల కోసం ఆమె 40,000 యువాన్ల (సుమారు 4.7 లక్షలు)కు పైగా అప్పు చేసింది.

ఓ రోజు మధ్యాహ్నం ఈ శస్త్రచికిత్సలు ప్రారంభమై ఐదు గంటలు కొనసాగాయి.ఈ చికిత్సల్లో రెండు కళ్లు ఒకేలా కనిపించేలా చేసే శస్త్రచికిత్స, ముక్కు ఆకారాన్ని మార్చే శస్త్రచికిత్సలు ఉన్నాయి.

తర్వాత రోజు ఉదయం, ఆమె మరో ఐదు గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకుంది.

ఈసారి ఆమె తొడలలోని కొవ్వును తీసి ముఖం, రొమ్ములలోకి ఇంజెక్ట్ చేసే సర్జరీలు చేయించుకుంది.

"""/" / అయితే శస్త్రచికిత్స తర్వాత క్లినిక్ నుంచి డిశ్చార్జ్ అయిన కొద్దిసేపటికే ఆమె ఎలివేటర్ దగ్గర కూలిపోయింది.

వెంటనే ఆమెను సెకండ్ నన్నింగ్ పీపుల్స్ హాస్పిటల్‌కు తరలించారు కానీ, వైద్యులు ఆమెను కాపాడలేకపోయారు.

పోస్టుమార్టం నివేదిక ప్రకారం, లైపోసక్షన్ శస్త్రచికిత్స(Liposuction Surgery) తర్వాత ఊపిరితిత్తులలో రక్తం గడ్డకట్టడం వల్ల తీవ్ర శ్వాసకోశ సమస్య వచ్చి ఆమె మరణించింది.

ఈ విషాద సంఘటనపై ఆమె కుటుంబం నన్నింగ్‌లోని జియాంగ్‌నాన్ జిల్లా ప్రజా కోర్టులో క్లినిక్‌పై కేసు వేసింది.

ఆమెకు 8 ఏళ్ల కూతురు, 4 ఏళ్ల కొడుకు ఉన్నారు.ఆమె భర్త ప్రకారం, క్లినిక్‌ ప్రారంభంలో 2 లక్షల యువాన్‌ల నష్టపరిహారం ఇవ్వడానికి అంగీకరించింది.

అయితే, అతను కనీసం 10 లక్షల యువాన్‌లు (10 Lakh Yuan)ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కోర్టును ఆశ్రయించాడు.

"""/" / కేసులో కోర్టు క్లినిక్‌పై 590,000 యువాన్‌ల (సుమారు 70 లక్షల రూపాయలు) నష్టపరిహారం విధించింది.

న్యాయమూర్తి లి షాన్ ఈ తీర్పును వెల్లడిస్తూ, క్లినిక్ రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోయింది, ఆ మహిళ మరణానికి సంబంధించిన వైద్య తప్పులు చేసిందని తెలిపారు.

ఈ సంఘటన సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.కోట్ల మంది ఈ సంఘటనపై స్పందిస్తున్నారు.

క్లినిక్ ఒకే రోజులో అనేక శస్త్రచికిత్సలు చేయించడం ద్వారా తీవ్రమైన ప్రమాదాలను పరిగణనలోకి తీసుకోలేదని చాలామంది విమర్శించారు.

మరికొందరు, క్లినిక్ ఆ మహిళను అప్పు చేసి శస్త్రచికిత్సలు చేయించుకోమని ప్రోత్సహించి, ఆమె కేసును మంచిగా నిర్వహించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అందం కోసం అతిగా ప్రయత్నిస్తే ఇలాంటి అనర్ధాలు ఎదురవుతాయని మరి కొంతమంది ఆమెను తిట్టారు.

ఈ సింపుల్ రెమెడీతో మీ ఐబ్రోస్ దట్టంగా మారడం గ్యారెంటీ!