సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వృద్ధ జంట.. ఇటీవలే 90వ వివాహ వార్షికోత్సవం
TeluguStop.com
ప్రస్తుత ఆధునిక సమాజంలో అంతా చాలా వేగంగా ప్రేమలో పడిపోతున్నారు.ఆ వెంటనే పెళ్లి లేదా లివింగ్ రిలేషన్‌లో ఉంటున్నారు.
ఇక బ్రేకప్ లేదా విడాకులు కూడా వెంటనే అయిపోతున్నాయి.ఇక పెద్దలు కుదిర్చిన సంబంధాలైనా మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతున్నాయి.
కడదాకా కలిసుండకుండా కొన్ని సంవత్సరాలు లేదా నెలలకే విడిపోతున్నారు.ఇలాంటి వారికి కనువిప్పుగా ఓ వృద్ధ జంట నిలుస్తున్నారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 90 సంవత్సరాలైంది వారు పెళ్లి చేసుకుని.
ఇటీవలే దానికి సంబంధించిన వేడుక కూడా చేసుకున్నారు.పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
వారిద్దరూ చైనాకు చెందిన వారు.ఇటీవలే 90వ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నారు.
90వ వార్షికోత్సవం అంటేనే వారి వయసు ఎంతుంటుందో మీకు అర్థమై ఉంటుంది.అందులో వృద్ధుడికి 109 ఏళ్లు కాగా మహిళకు 108 ఏళ్లు.
ఇద్దరూ తమ పెళ్లినాటి స్మృతులను తలచుకుంటూ తాజా పెళ్లి దుస్తుల్లో సందడి చేశారు.
ఇన్నేళ్ల పాటు దాంపత్య జీవితం కొనసాగించిన వారికి నెటిజన్లు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. """/"/
చాలా మంది పెళ్లి చేసుకున్నాక గొడవలు పడుతూ ఉంటారు.
మనస్పర్థలతో ఒకరిపై ఒకరు పంతాలకు పోతుంటారు.విడాకులకు సిద్ధమై పిల్లల కోసం, ఆస్తుల కోసం, అవతలి వారిని ఇబ్బంది పెట్టడం కోసం తమ శక్తియుక్తులను ఉపయోగిస్తుంటారు.
చివరికి కోర్టుల ద్వారా కొందరు విడిపోతుంటే, మరి కొందరు పరస్పరం విడిపోదాం అని చెప్పుకుని వేరవుతున్నారు.
ఇలా చిన్న చిన్న కారణాలకే విడిపోయే వారికి ఈ చైనా జంట ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
ముదిమి వయసులోనూ ఒకరి కోసం మరొకరు తోడుగా నడుస్తున్నారు.