భారతీయులకు చైనా బంపరాఫర్.. ఏకంగా 85 వేల వీసాలు!

ప్రపంచంలో బలమైన ఆర్ధిక శక్తులుగా ఎదుగుతున్న భారత్ - చైనాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే.

ఇరుదేశాల మధ్య బలమైన వాణిజ్య సంబంధాలు ఉన్నప్పటికీ , భారత్‌తో( India ) ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతుంటుంది చైనా.

( China ) తనకు పోటీగా ఉన్న చైనాను నియంత్రించడానికి ఇండియా కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటుంది.

అయితే ఇటీవల భారత్ విషయంగా చైనా వ్యవహారశైలిలో అనూహ్యంగా మార్పులు కనిపిస్తున్నాయి.సరిహద్దుల్లో తన సైన్యాన్ని వెనక్కి పిలిచిన చైనా.

2020 నాటి యథాస్థితికి కట్టుబడి ఉంటామని తెలిపింది.అలాగే భారత ఆర్ధిక వృద్ధి బాగుందని.

చినీ - హిందీ భాయ్ భాయ్ అంటూ చైనా కాన్సుల్ జనరల్ కొనియాడటం భారత వ్యూహకర్తలను ఆశ్చర్యంలో ముంచెత్తింది.

"""/" / అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) బాధ్యతలు చేపట్టాక ప్రపంచ దేశాల మీద ఆర్ధిక యుద్దానికి దిగారు.

శత్రు దేశాలు, మిత్ర దేశాలు అన్న తేడా లేకుండా భారీ ఎత్తున సుంకాలు( Tariffs ) పెంచుతున్నారు.

ఈ క్రమంలోనే భారత్‌కు చైనా స్నేహ హస్తం చాచారు.తాజాగా చైనా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

తమ దేశాల భారతీయులు స్వేచ్చగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంది.దీనిలో భాగంగా ఏప్రిల్ 9 వరకు 85 వేల వీసాలను( China Visas ) జారీ చేసింది.

ఈ మేరకు భారత్‌లో చైనా రాయబారి జు ఫీహాంగ్( Xu Feihong ) ప్రకటించారు.

చైనాను సందర్శించడానికి మరింత మంది భారతీయ మిత్రులకు స్వాగతమంటూ ఆయన ట్వీట్ చేశారు.

"""/" / ఇక విదేశీ పర్యటకులకు చైనా వీసా ధరలను కూడా తగ్గించింది.

దీనిని ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది.దీని ప్రకారం సింగిల్ ఎంట్రీ వీసాలకు రూ.

2,900.డబుల్ ఎంట్రీ వీసాకు రూ.

4,400.ఆరు నెలల వ్యవధి ఉండే మల్టిపుల్ ఎంట్రీ వీసాకు రూ.

5,900.ఏడాదికి పైగా గడువు ఉండే మల్టీ ఎంట్రీ వీసాకు రూ.

8,800లను రుసుములుగా నిర్ణయించారు.తాజాగా ఇప్పుడు భారతీయులకు వీసాల జారీని సులభతరం చేయడం ఇరు దేశాల్లోనూ చర్చకు దారి తీసింది.

Casimba Bonuses And Promotions: A Value Breakdown For NZ Players