పాకిస్థాన్‌కు చైనా కోలుకోలేని షాక్.. ఆ దేశంలో వ్యాపారాలు మూత

ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌కు( Pakistan ) మరో కోలుకోలేని షాక్ తగిలింది.

పాక్‌లో తమ వ్యాపారాలను మూసేస్తున్నట్లు చైనా ప్రకటించింది.బలూచిస్థాన్, సింధీల వంటి జాతీయవాద తిరుగుబాటుదారుల దాడుల నుండి చైనా జాతీయులను రక్షించే ప్రయత్నంలో చైనా( China ) ఈ నిర్ణయం తీసుకుంది.

రక్షణ కల్పించకుండా, ప్రాణాలు పోగొట్టుకుంటూ తమ దేశ ప్రజలు పాక్‌లో వ్యాపారం చేయలేరని చైనా పేర్కొంది.

పాక్‌లోని చైనీస్ రెస్టారెంట్, సూపర్ మార్కెట్, సీ ప్రొడక్ట్స్ కంపెనీని మూసివేసినట్లు తెలుస్తోంది.

ఈ పరిణామాలు ఇస్లామాబాద్ - బీజింగ్( Islamabad - Beijing ) మధ్య స్నేహానికి బీటలు పడే అవకాశం ఉంది.

ఉక్కు-కాస్ట్ స్నేహాన్ని చెరిపేసే అవకాశం ఉంది.మరోవైపు చైనా ప్రభావాన్ని తగ్గించాలని పాకిస్థాన్ భావిస్తున్నట్లు పశ్చిమ దేశాలకు ఇది సంకేతం కూడా కావచ్చు.

"""/" / ఇటీవలి సంవత్సరాలలో వేర్పాటువాదులు మరియు ఇతర తీవ్రవాదులకు చైనా వ్యాపార ప్రయోజనాలే కాకుండా చైనా జాతీయులు ప్రధాన లక్ష్యంగా మారారు.

ఇటీవల తీవ్రవాద దాడిని ఎదుర్కొన్న కరాచీ పోలీసులు తర్వాత విచారణ చేపట్టారు.ఇంటెలిజెన్స్ హెచ్చరికలను అందుకున్న తర్వాత కొన్ని చైనా వ్యాపారాలను మూసివేశారు.

చట్టం ప్రకారం సీసీ టీవీ కెమెరాలు, బయోమెట్రిక్ సిస్టమ్, వాక్‌త్రూ గేట్లు, సెక్యూరిటీ అలారం, ఇతర ఆధునిక గాడ్జెట్‌లను పెట్టుకోవాలని సూచించినా చైనా వ్యాపారులు పెట్టుకోలేదని కారణంతో వాటిని మూసేసినట్లు తెలుస్తోంది.

ఏదేమైనా పాక్‌లో చైనా వ్యాపారాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.తెహ్రిక్ ఏ తాలిబాన్ సంస్థ ఉగ్రవాదులు చైనా వ్యాపారాలపై దాడి చేస్తున్నారు.

దీనిని మరో కోణంలోని కొందరు విశ్లేషిస్తున్నారు.ప్రస్తుతం పాక్ ప్రభుత్వానికి భారీ ఆర్థిక సాయం అవసరం ఉంది.

పశ్చిమ దేశాల నుంచి ఆర్థిక సాయం కావాలంటే ఖచ్చితంగా చైనాకు దూరంగా ఉండాలని పాక్ భావిస్తోంది.

అందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

జై హనుమాన్… హనుమంతుడిగా చరణ్ క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్?