ఇదేందయ్యా ఇది.. బంగారం ఇస్తే డబ్బులిచ్చే ఏటీఎం.. చైనాలో వింత మెషిన్.. ఇంటర్నెట్ షాక్!

షాంఘైలో మొదలైన ఈఓ సరికొత్త, ప్రత్యేకమైన ఏటీఎం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఈ మెషిన్ చేసే పని నిజంగా అద్భుతం.మీ దగ్గర ఉన్న బంగారాన్ని తీసుకెళ్లి ఇందులో పెడితే చాలు ఆ బంగారాన్ని అక్కడికక్కడే కరిగించి, దాని విలువకు సమానమైన డబ్బును మీ బ్యాంకు అకౌంట్‌లోకి క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది.

వినడానికే ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాలో చూసిన సీన్ లా ఉంది కదూ, అంత వేగంగా, హైటెక్ పద్ధతిలో పని చేస్తుంది ఈ మెషిన్.

చైనాలో ఇలాంటి 'బంగారాన్ని కరిగించి డబ్బులిచ్చే' ఏటీఎం ఇదే మొదటిసారి అట.ప్రజలు తమ దగ్గరున్న బంగారు ఆభరణాలు, నాణేలు లేదా బిస్కెట్లను ఈ మెషిన్‌లో నిర్భయంగా పెట్టవచ్చు.

ఆ వెంటనే, మెషిన్ ఆ బంగారాన్ని అక్కడికక్కడే కరిగించేస్తుంది.అత్యంత అధునాతన పరికరాలతో బంగారం బరువు, స్వచ్ఛతను కచ్చితంగా తనిఖీ చేస్తుంది.

అప్పటికప్పుడు మార్కెట్లో ఉన్న రేటు ఆధారంగా బంగారం విలువను లెక్క కట్టి, కేవలం కొన్ని నిమిషాల్లోనే ఆ మొత్తాన్ని నేరుగా మీ బ్యాంకు ఖాతాకు పంపేస్తుంది.

ప్రాసెస్ మొత్తం చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. """/" / అసలు ఈ మెషిన్ గురించి ప్రపంచానికి ఎలా తెలిసిందంటే టర్కిష్ టెక్ ఇన్ఫ్లుయెన్సర్ అయిన టన్సు యెగెన్ (Tansu Yegen) దీనికి సంబంధించిన ఒక వీడియోను X (గతంలో ట్విట్టర్) లో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో బంగారం ఎలా కరుగుతుంది, డబ్బు ఎలా అకౌంట్లోకి వెళ్తుంది అనేదంతా క్లియర్‌గా చూపించారు.

ఇంకేముంది ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయిపోయింది.ఈ వింత మెషిన్ చూసి నెటిజన్లు చాలామంది నోరెళ్లబెట్టారు.

భవిష్యత్తులో డబ్బు లావాదేవీలు, టెక్నాలజీ ఎలా ఉండబోతున్నాయో అనే దానిపై కూడా ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ మొదలయ్యింది.

ఈ కొత్త టెక్నాలజీపై నిపుణులు కూడా చాలా ఆసక్తిగా ఉన్నారు.బంగారాన్ని ఎప్పుడూ విలువైన ఆస్తిగానే చూస్తారు కదా.

"""/" / ఇప్పుడు చైనా దీన్ని ఆధునిక ఫైనాన్షియల్ టెక్నాలజీ (ఫిన్‌టెక్) తో కలిపి చూడటం 'పాత పద్ధతికి, కొత్త టెక్నాలజీకి' ఒక స్మార్ట్ మిక్స్ లా ఉందని అంటున్నారు.

దీనివల్ల సామాన్య ప్రజలకు కూడా బంగారం కొనుగోలు, అమ్మకాలు మరింత సులభతరం అవుతాయని, అందరికీ అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అయితే ఓ రేంజ్‌లో రియాక్ట్ అవుతున్నారు! కొందరు దీన్ని చూసి అద్భుతం అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

టెక్ నిపుణుడు అద్వైత్ అరోరా (Advait Arora) తన పోస్ట్‌లో ఏమన్నారంటే, "బంగారాన్ని కరిగించి, డబ్బును అకౌంట్లోకి పంపే గోల్డ్ ఏటీఎం – సింపుల్, ఫాస్ట్, పవర్‌ఫుల్.

పాత సంపదను కొత్త టెక్నాలజీతో ఎలా కలపాలో చైనాకు బాగా తెలుసు" అని మెచ్చుకున్నారు.

ఇంకొందరు మాత్రం ఈర్ష్యతో, నిరాశతో స్పందిస్తున్నారు."అమెరికాలో ఇలాంటి కూల్ టెక్నాలజీలు ఎందుకు ఉండవు మాకు?" అని ఒక యూజర్ ప్రశ్నించారు.

ఈ గోల్డ్ ఏటీఎం ఇప్పుడు చైనా ఆవిష్కరణకు ఒక నిదర్శనంగా మారింది.సాంప్రదాయ ఆస్తులను ఆధునిక టెక్నాలజీతో అది ఎంత వేగంగా మిళితం చేస్తుందో చూపించింది.

దీంతో, ఇతర దేశాలు వెనుకబడిపోతున్నాయేమో అని చూస్తున్నవారు ఆశ్చర్యపోతున్నారు.