డ్రాగన్ ఫ్రూట్స్‌తో క‌రోనా వ్యాప్తి.. హ‌డావుడిగా ప‌లు సూపర్ మార్కెట్లు మూసివేత‌

కరోనాలోని ఓమిక్రాన్ వేరియంట్ ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోంది.ఇది దాదాపు అన్ని దేశాలను చుట్టుముట్టింది.

ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ఆహార పదార్థాలలోనూ కరోనా ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన‌ ఆధారాలు ల‌భ్యంకాలేదు.అయితే తాజాగా చైనాలో డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ గుర్తించార‌నే వార్తలు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.

ఈ డ్రాగన్ ఫ్రూట్స్ వియత్నం నుండి చైనాకు వచ్చాయి.ఈ వార్త బయటకు రావడంతో చైనాలోని పలు సూపర్ మార్కెట్లు మూతపడ్డాయి.

మీడియాకు అందిన స‌మాచారం ప్ర‌కారం చైనాలోని జెజియాంగ్, జియాంగ్జి ప్రావిన్స్‌లలోని తొమ్మిది నగరాల్లోని పండ్లను పరిశీలించగా వాటిలో కరోనా వైరస్ నిర్ధారణ అయింది.

ఈ నేప‌ధ్యంలో ఈ పండ్ల కొనుగోలు దారులు క్వారంటైన్‌లో ఉండాల‌ని అధికారులు ఆదేశించారు.

దీంతో పాటు విదేశాల నుంచి వచ్చే ఆహార పదార్థాల త‌నిఖీల‌ను ప్రారంభించారు.డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిన నేప‌ధ్యంలో చైనా జనవరి 26 వరకు వియత్నాం నుండి డ్రాగన్ ఫ్రూట్ దిగుమతిని నిషేధించింది.

గత వారం చైనాలో డ్రాగన్ ఫ్రూట్‌లో కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.ముఖ్యంగా, చైనాలోని జియాన్ నగరంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండ‌టంతో అక్క‌డ లాక్‌డౌన్ అమ‌లులో ఉంది.

ఇప్పుడు కొత్త‌గా యుజు నగరంలో లాక్‌డౌన్ విధించారు.

రోడ్డు ప్రమాదానికి కారణమైన పోలీస్ ఛేజింగ్.. ముగ్గురు భారతీయులు దుర్మరణం, మృతుల్లో 3 నెలల చిన్నారి