కుతంత్రాలకు పెట్టిన పేరుగా చైనాను పేర్కొంటున్నాయి కొన్ని ప్రపంచ దేశాలు.ఇప్పటికే కోవిడ్ వైరస్ సృష్టికి ఈ డ్రాగన్ కంట్రీనే కారణం అంటూ వార్తలు విపరీతంగా ప్రచారంలోకి కూడా వచ్చాయి.
అంతే కాకుండా భారత సరిహద్దుల్లో వివాదాలు సృష్టించి గొడవకు కారణం అయ్యింది.ఇక భారత్ దేశాన్ని నేరుగా ఎదుర్కొనలేక ఇండియాకు సరిహద్దుల్లో ఉన్న దేశాలతో చీకటి ఒప్పందాలను చేసుకుందనే ప్రచారం కూడా జరిగింది.
ఈ క్రమంలోనే నేపాల్ ను కూడా తన వశం చేసుకుందట చైనా.ఇదిలా ఉండగా చైనాలో తయారైనా సీనోఫామ్ వ్యాక్సిన్‌లను నేపాల్‌లో వేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం సీనోఫామ్ వ్యాక్సిన్ ధరను బహిర్గతం చేయకూడదట.
కానీ నేపాల్ లో ఉన్న కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని బహిర్గతం చేయడంతో నేపాల్ పై చైనా ఆగ్రహంతో ఉందట.
కాగా ధరల విషయం బహిర్గతం కావడానికి కారణమైన మీడియా సంస్థల పై చర్యలు తీసుకోవడానికి నేపాల్ ప్రభుత్వం సిద్ధం అయినట్లుగా సమాచారం.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్25, శుక్రవారం 2025