గడ్డంపై వచ్చే బ్లాక్ హెడ్స్ తొలగించుకోవడానికి అద్భుతమైన పాక్స్

ముఖం అందంగా ఉండాలని ప్రతి మహిళ కోరుకుంటుంది.ముఖం మీద ఏమైనా మచ్చలు, బ్లాక్ హెడ్స్ వంటివి ఉంటే ముఖం అసహ్యంగా కనపడుతుంది.

వీటిని తొలగించుకోవడానికి కూడా కాస్త కష్టం అవుతుంది.ఇప్పుడు చెప్పే ఇంటి చిట్కాలతో సులభంగా సమర్ధవంతంగా తొలగించుకోవచ్చు.

ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.సముద్రపు ఉప్పులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉండుట వలన మూసుకుపోయిన చర్మ రంధ్రాలను తెరుచుకొనేలా చేసి బ్లాక్ హెడ్స్ కారకాన్ని తొలగిస్తుంది.

ఒక స్పూన్ రోజ్ వాటర్ లో చిటికెడు సముద్రపు ఉప్పు వేసి బాగా కలిపి ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అరస్పూన్ కొబ్బరినూనెలో రెండు చుక్కల ట్రీ టీ ఆయిల్ వేసి ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ట్రీ టీ ఆయిల్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ చర్మ రంద్రాల్లో ఉండే విష పదార్ధాలను తొలగిస్తుంది.

గడ్డం మీద ఉన్న బ్లాక్ హెడ్స్ తొలగించటంలో విటమిన్ సి పొడి బాగా పనిచేస్తుంది.

ఒక స్పూన్ రోజ్ వాటర్ లో అరస్పూన్ విటమిన్ సి పొడి వేసి బాగా కలపాలి.

ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంలో రాసి పది నిముషాలు అయ్యాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.

గేమ్ ఛేంజర్ రిజల్ట్ పై రామ్ చరణ్ రియాక్షన్ ఇదే.. గర్వపడేలా చేస్తానంటూ?