ప్లాస్టిక్ వాడకం డేంజర్ అని చింపాంజీలకు ముందే తెలుసా..?
TeluguStop.com
నిత్యం సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.జంతువులకు సంబంధిచిన వీడియోలు అయితే బాగా వైరల్ గా మారుతున్నాయి.
ఒక్కోసారి మనకు తెలియని, మనం పాటించని పనులను కూడా జంతువులు చేసి మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి.
అలాంటి ఒక అద్భుతమైన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇందులో కనిపించే చింపాంజీని చూస్తే మనం ఆశ్చర్యపోవడం ఖాయం.అది చేసే పని చూస్తే మనుషులం అయిన మనమే తలదించుకునే పరిస్థితి వస్తుంది.
ప్లాస్టిక్ వాడడం వలన పర్యావరణానికి ఎంతగానో ప్రమాదం అనే విషయం మన అందరికి తెలిసిన విషయమే కానీ.
, మనం ఎవ్వరం కూడా ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించలేకపోతున్నాం.కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో చింపాంజీ చేసిన పని చూసి మనం వారెవ్వా అనాలిసిందే.
చింపాంజీ తన రెండు కాళ్లపై నడుస్తూ కనిపడడం మనం ఈ వీడియోలో చూడవచ్చు.
అయితే అందులో కొత్తేమి ఉంది అనుకుంటున్నారా.? అలా నడవడం చింపాజీకి కొత్త ఏమి కాదు.
కానీ., రెండు చేతుల్లోనూ పాదాల వేళ్లపై కొన్ని పండ్లను అలాగే నోటిలో కూడా పండ్లను పెట్టుకుని నడుస్తూ కనిపిస్తుంది.
బహుశా దానికి ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు అనే విషయం అర్ధం అయ్యే ఉంటుంది.
"""/"/
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు, దాని కింద ఇలా ఒక ట్విట్టర్ రాసుకొచ్చాడు.
మీరు ఒక ప్లాస్టిక్ బ్యాగ్ కోసం 10 రూపాయలు ఖర్చుపెట్టకూడదు అని అనుకున్నప్పుడు మీరు కూడా ఇలా చేయవచ్చు అంటూ ఓ ట్విట్టర్ యూజర్ రాసుకొచ్చారు.
సోషల్ మీడియాలో ఈ వీడియోను చుసిన ప్రజలు తమదైన శైలిలో ఇలా కామెంట్స్ పెట్టారు.
ప్లాస్టిక్ బ్యాగులు వాడకం అనేది భూమికి మంచిది కాదని కొందరు అంటే, ఈ విషయం కోతికి కూడా తెలుసు అని మరోక యూజర్ కామెంట్ రాశారు.
రామ్ చరణ్ బుచ్చిబాబు సినిమాలో అనిమల్ హీరో నటిస్తున్నాడా..?