వీడియో వైరల్.. మనుషుల కంటే వేగంగా చింపాంజీ మెమోరీ..!

చింపాంజీలు, మనుషులు జన్యుపరంగా చాలా దగ్గరి సంబంధం కలిగి ఉంటాయి.ఎందుకంటే కోతుల జాతుల నుంచి మనుషులు వచ్చారన్నది అందరికీ తెలిసిందే.

ఇక మనుషుల తర్వాత తెలివైన జంతువులు ఏవంటే.అవి కోతులు, చింపాంజీలు మాత్రమే.

ఇక కోతుల డీఎన్ఏ, మనుషుల డీఎన్ఏ దాదాపు 18% సమానంగా ఉంటుందని ఓ అధ్యయనంలో తేలింది.

అందుకే చింపాంజీలు కూడా మనుషుల మాదిరిగానే ప్రవర్తిస్తాయట.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది.

ఆ వీడియోలో ఓ చింపాంజీ మనిషి మాదిరిగానే ప్రవర్తించాడు.అసలు చింపాంజీలు మనుషులకు ఎంత దగ్గరి సంబంధం ఉందో ఈ వీడియో చూస్తే తెలిసిపోతుంది.

సాధారణంగా చింపాంజీలు మనుషులు చేసే పనులు చేస్తుంటాయి.ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి.

కానీ నంబర్స్ ని మనుషులు మాత్రమే గుర్తపడతారు.చింపాంజీలకు నంబర్స్ తెలియవు.

కానీ ఇక్కడ ఓ చింపాంజీ నంబర్ గేమ్ ఆడుతోంది.1 నుంచి 9 వరకు ఉన్న నంబర్స్ స్క్రీన్ పై కనిపించగానే.

వాటిని చాలా వేగంగా క్రమ వరసలో టచ్ చేస్తోంది ఆ చింపాంజీ. """/"/ ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోకు ‘చింపాంజీలు అద్భుతమైన మెమోరీ స్కిల్స్ కలిగి ఉన్నాయని చూపించాయి’ అంటూ క్యాప్షన్ పెట్టారు.

ఈ వీడియోలో చింపాంజీ 1 నుంచి 9 వరకు అన్ని నంబర్లను గుర్తుపడుతోంది.

అసలు స్క్రీన్ పై ఆర్డర్ లో లేని నంబర్లను చాలా వేగంగా వరుసక్రమంలో గుర్తిస్తోంది.

అసలు మనుషులు కూడా గుర్తించలేనంత వేగంగా ఆ చింపాంజీ నంబర్స్ ని టచ్ చేస్తోంది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మనుషుల కంటే చింపాంజీలు మంచి జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నాయని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కెనడా : యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ సెనేట్‌కు నామినేట్ అయిన భారత సంతతి వ్యక్తి