అరె పిల్లలు.. అది తాడు కదురయ్యా.. కొండ చిలువతో స్కిప్పింగ్
TeluguStop.com
సోషల్ మీడియాలో తరచుగా పాములు, కొండ చిలువల వీడియోలు వైరల్ అవుతుంటాయి.పాములు, కొండ చిలువలు కనిపిస్తేనే చాలామంది గజ గజ వణికిపోతారు.
వీటి పేరు వినగానే దూరంగా పారిపోతారు.సాధారణంగా పాములు, కొండ చిలువలు చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఉంటాయి.
ఎలుకల వేటలో జనావాసాల్లోకి అపుడప్పుడు వస్తాయి.అయితే ఇటీవల రోడ్ల మీద పాములు, కొండ చిలువలు కనిపించిన వీడియోలు ఎక్కువగా వైరల్( Viral Video ) అవుతున్నాయి.
ఈ వీడియోలను చూసేందుకు నెటిజన్లు సైతం ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. """/" /
అయితే ఇలా పాములు కనిపించినప్పుడు స్నేక్ సొసైటీకి సమాచారం ఇచ్చే వారు ఉన్నారు.
అలాగే మరికొందరు మాత్రం వాటిమీద తమ శాడిజం చూపిస్తూ ఉంటారు.అలంటి ఘటనలకు సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి.
అయితే, ప్రస్తుతం ఒక వీడియో మాత్రం తెగ ట్రెండింగ్ అవుతోంది.ఈ వీడియోలో కొంత మంది పిల్లలు.
ఒక కొండ చిలువను( Python ) పట్టుకుని దానితో స్కిప్పింగ్( Skipping ) ఆడుతున్నారు.
"""/" /
అదేదో తాడులా.ఇరువైపులా పట్టుకుని మరీ స్కిప్పింగ్ ఆడుతున్నారు.
పిల్లలు సరదాగా కేకలు వేస్తూ, కొండ చిలువతో స్కిప్పింగ్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.
వారికి అదృష్టం ఏంటంటే.అది ప్రాణాలతో లేదు.
ఈ సంఘటన ఆస్ట్రేలియాలో( Australia ) చోటు చేసుకుంది.సెంట్రల్ క్వీన్స్‌ల్యాండ్‌లోని రాక్‌హాంప్టన్ కొద్ది దూరంలో ఉన్న వూరాబిండా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
ఈ వీడియోలో కొంత మంది పిల్లలు కొండ చిలువను తమ చేతిలో పట్టుకున్నారు.
దాన్ని స్కిప్పింగ్ తాడులా వాడకూడదా? అని అనుకున్నారేమో! వెంటనే దాన్ని ఇద్దరు పిల్లలు ఇరువైపులా పట్టుకుని మరికొందరు స్కిప్పింగ్ చేస్తూ రచ్చ చేశారు.
ఆతర్వాత దాన్ని దూరంగా విసిరేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
నెటిజన్లు దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు.ఈ తరహా వీడియోలు వైరల్ కావడం కొత్తేం కాదు.
కానీ, కొండ చిలువతో స్కిప్పింగ్ ఆడటం చాలా అరుదైన దృశ్యం అని చెప్పాలి.