పిల్లలు జాగ్రత్త.. బిస్కెట్ లో ఇనుప తీగ.. (వీడియో)
TeluguStop.com
ఒక కప్పు టీ లోకి బిస్కెట్లు( Biscuits ) తినకండా చాలా మందికి ప్రారంభం కాదు.
ఎందుకంటే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుందని చాలా మంది చెబుతుంటారు.
అందుకే టీతో పాటు కొన్ని బిస్కెట్లు తినడం మనకు అలవాటు ఎందరికో.చాలా మంది ప్రజలు తరచుగా టీ లేదా కాఫీతో బిస్కెట్లు తింటారు.
ఉదయం మాత్రమే కాదు, రోజులో చాలా సార్లు ఇలా చేస్తుంటారు.కానీ, ఇప్పుడు వెలుగులోకి వచ్చిన సంఘటన తెలిస్తే.
మీరు కూడా బిస్కెట్లు తినేటప్పుడు లేదా మీ పిల్లలకు పెట్టేటప్పుడు 100 సార్లు ఆలోచిస్తారు.
దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.మరి ఇందుకు సంబంధించిన ఘటన విశేషాలు చూస్తే.
"""/" /
తెలంగాణలోని కామారెడ్డి గ్రామంలో బ్రిటానియా బోర్బన్ బిస్కెట్‌లో( Britannia Bourbon Biscuit ) సన్నని ఇనుప తీగ కనిపించింది.
ఈ షాకింగ్ ఘటనను సదరు వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు.
వీడియోలో బిస్కెట్‌లో సన్నని తీగ వచ్చింది.ఆ వ్యక్తి తన పిల్లల కోసం బిస్కెట్ల ప్యాకెట్ తీసుకొచ్చానని, పిల్లలు భోజనం చేస్తుండగా బిస్కెట్లలో ఒకదానిలో వైర్ కనిపించిందని పేర్కొన్నాడు.
కామారెడ్డి జిల్లా దేవునిపల్లి గ్రామంలోని హనుమంతరెడ్డి తాను స్థానిక దుకాణంలో బ్రిటానియా కంపెనీ బోర్బన్ బిస్కెట్ల పెట్టెను కొన్నానని, పిల్లలు బిస్కెట్లు తింటుండగా, ఒక బిస్కెట్‌లో ఏదో కనిపించిందని ఆ వ్యక్తి వీడియోలో పేర్కొన్నాడు.
ఆ తర్వాత నిశితంగా పరిశీలించగా. """/" / బిస్కెట్‌లో సన్నపాటి ఇనుప తీగ ఉండటాన్ని గమనించాడు.
బిస్కెట్లు, చాక్లెట్లు వంటి ఉత్పత్తులను పిల్లలు పెద్ద మొత్తంలో వినియోగిస్తుంటారు.ఈ ఉత్పత్తులలో ఆహార భద్రత గురించి పట్టించుకోకపోవడం తీవ్రమైన విషయంగా భావించాలని కోరాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.బ్రాండెడ్ గా పేరొందిన కంపెనీలోనే ఇలాంటి ఘోరాలు జరుగుతే ఎలా అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు.
నందమూరి మల్టీస్టారర్ తెరకెక్కే ఛాన్స్ లేదా.. బాలయ్యకు ఈ కాంబో ఇష్టం లేదా?