ఈ ఫోటోలో ఉన్న మెగా, దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీ హీరోలను మీరు గుర్తు పట్టగలరా?

సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత సెలబ్రిటీలకు, అభిమానులకు మధ్య దూరం తగ్గిందనే సంగతి తెలిసిందే.

సోషల్ మీడియా ద్వారా సెలబ్రిటీలకు సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుండగా ఆ ఫోటోలో మెగా, దగ్గుబాటి, అల్లు ఫ్యామిలీకి చెందిన హీరోలు ఉండటం గమనార్హం.

ముగ్గురు టాలీవుడ్ హీరోలు ఒకే స్కూల్ లో చదివారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వైరల్ అవుతున్న ఫోటోలో చరణ్, రానా ఒకే వరుసగా నిలబడి ఉండగా అల్లు శిరీష్ మాత్రం మరో చోట నిలబడి ఉన్నాడు.

ఫోటోలో అల్లు శిరీష్ కొంచెం బొద్దుగా ఉండటంతో అల్లు శిరీష్ ను గుర్తించడం అభిమానులకు కూడా ఒకింత కష్టమవుతోంది.

రామ్ చరణ్, రానాల వయస్సు దాదాపుగా సమానం కాగా శిరీష్ మాత్రం వీళ్లిద్దరి కంటే రెండు సంవత్సరాల చిన్నవాడు కావడం గమనార్హం.

చెన్నైలోని స్కూల్ లో వీళ్లు కలిసి చదువుకున్నారు.రామ్ చరణ్ తాజాగా ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో కెరీర్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు.

"""/"/ ఈ సినిమా నిర్మాత దానయ్యకు 100 కోట్ల రూపాయల నుంచి 200 కోట్ల రూపాయల వరకు లాభాలను అందించిందని సమాచారం అందుతోంది.

రామ్ చరణ్ ప్రస్తుతం భవిష్యత్తు ప్రాజెక్టులతో నటుడిగా బిజీగా ఉన్నారు.ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో చరణ్ రెమ్యునరేషన్ పెరిగిందని తెలుస్తోంది.

"""/"/ మరో హీరో రానా ఈ ఏడాది భీమ్లా నాయక్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

పవన్, రానా కలిసి నటించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చేసింది.మరోవైపు అల్లు శిరీష్ సినీ కెరీర్ లో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

సినిమాల ఎంపిక విషయంలో అల్లు శిరీష్ ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?