పుట్టిన ఏడాదికే వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించిన బుడ్డోడు.. ఎన్ని గ్రాములు పుట్టాడో తెలిస్తే

పుట్టుక ఓ గొప్ప వ‌రం.దాన్ని నిల‌బెట్టుకోవ‌డం పెద్ద అదృష్టం.

ఎందుకంటే పుట్టిన ప్ర‌తి ఒక్క‌రూ బ్ర‌తుకు‌తార‌న్న గ్యారంటీ లేదు.కొంద‌రు పుట్ట‌గానే మ‌ర‌ణిస్తుంటారు.

అలాంటి వారి గురించి నిత్యం మ‌నం వింటూనే ఉన్నాం.కొంద‌రు బ‌రువు త‌క్కువ‌గా పుట్ట‌డం లేదంటే ఇత‌ర అనారోగ్య కార‌ణాల‌తో చ‌నిపోతుంటారు.

అయితే ఇప్పుడు ఓ బుడ్డోడు మాత్రం వీరంద‌రిలాగా కాకుండా తాను పుట్టిందే గ్రాముల్లో అయినా స‌రే బ‌తికి చూపించాడు.

పైగా ఫ‌స్ట్ బ‌ర్త్ డే కూడా చేసుకోబోతున్నాడు.ఇలా అత్యంత త‌క్కువ బ‌రువుతో పుట్టడ‌మే కాకుండా బ్ర‌తికి చూపించి గిన్నిస్‌ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు.

ఇంగ్లాండ్‌కు చెందిన మిచెల్‌ బట్లర్ కు గ‌త జులై నెల‌లో ఇద్ద‌రు కవలలు పుట్టారు.

అయ‌తే వీరిద్ద‌రూ నెలలు నిండకముందే పుట్ట‌డంతో స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది.పుట్టిన క‌వ‌ల‌ల్లో ఆడ శిశువు చ‌నిపోగా.

బుడ్డోడు మాత్రం బ‌తికాడు.అయితే ఆ చిన్నోడు ఇప్పుడు ఏకంగా ఏడాది వ‌య‌సు పూర్తి చేసుకున్నాడు.

ఇందులో విశేషం ఏమి ఉంది అనుకోకండి అత‌ను ఇప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ ప్రిమెచ్యూర్ బేబీ టైటిల్ ను గెలుచుకున్నాడు.

అత‌ను పుట్టిన‌ప్పుడు కేవ‌లం 500గ్రాముల కంటే త‌క్కువ బ‌రువు ఉన్నాడు.కానీ అత‌న్ని వెంటిలేట‌ర్ మీద ఉంచ‌డంతో ఇన్ని రోజులు బ‌త‌క‌గ‌లిగాడు.

నిజానికి శిశువు త‌ల్లి క‌డుపులో 40 వారాలు ఉండాలి.కానీ ఆ బుడ్డోడు మాత్రం 21 వారాల 1 రోజుకే పుట్ట‌డంతో పెద్ద స‌మ‌స్య వ‌చ్చింది.

అత‌న్ని బ‌తికించేందుకు డాక్ట‌ర్లు చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌చ్చింది.మూడు నెలలపాటు వెంటిలేటర్ మీద ఉంచ‌డంతో పాటు అనేక ర‌కాలుగా అత‌నికి ట్రీట్ మెంట్ ఇస్తేనే ఇప్పుడు బ‌తికున్నాడు.

దీంతో అత‌న్ని చూసిన ఆ త‌ల్లి ఆనందానికి అవ‌ధుల్లేకుండా పోయాయి.పైగా ఇప్పుడు అత‌ను ఫ‌స్ట్ బ‌ర్త్ డేను కూడా చేసుకోబోతున్నాడు.

అత‌న్ని గిన్నీస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డులోకి ఎక్కించ‌గా అత‌ని గురించిన వార్త‌లు విప‌రీతంగా వైర‌ల్ అయిపోతున్నాయి.

కాలి మ‌డ‌మ‌ల న‌లుపు పోవాలా.. అయితే ఈ టిప్స్ మీకోస‌మే..!