వైరల్: బొమ్మ పైథాన్ తో ఆడుకోవాల్సిన వయసులో నిజమైన పైథాన్ తో స్నేహం చేస్తున్న చిన్నారి!
TeluguStop.com
కొన్ని కొన్ని దృశ్యాలు నిజ జీవితంలో చూసినపుడు కాసేపు స్తంభించిపోతూ ఉంటాము.పైగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తరువాత ఇలాంటి విషయాలు యిట్టె తెలిసిపోతున్నాయి.
సాధారణంగా మన ఇళ్లల్లోని పసి బిడ్డలు అందమైన బొమ్మలతో ఆడుకుంటూ వుంటారు.అయితే కొన్ని కొన్ని ప్రాంతాలలోని పిల్లలకు తమ బాల్యం ఎలా గడుస్తుందో వారికే తెలియదు.
ఓ రకంగా చెప్పాలంటే వారు ప్రకృతి ఒడిలో పెరుగుతారు.అందుకే వారికి వివిధ జంతువులతో విడదీయలేని బంధం ఉంటుంది.
"""/" /
అలాంటి జంతువులను చూస్తేనే మనకి సగం తడిసిపోతుంది.అలాంటిది ఆ పిల్లాడు దానితో ఆడుకోవడం ఇపుడు నెటిజన్లకు షాకిస్తోంది.
అవును, ఆ పిల్లాడు భారీ కొండచిలువతో ఆడుతున్నాడు.వివరాల్లోకి వెళితే, పాములంటే దాదాపుగా మనందరికీ భయమే.
పామును నేరుగా అయినా, ఫోటోస్ లో, వీడియోస్ లో చూసినా భయపడతాము.అలాంటిది ఆ పిల్లాడు దాదాపు పది అడుగులు వున్న ఓ పైథాన్ తో ఆడుకోవడం ఇక్కడ మనం చూడవచ్చు.
నిండా రెండేళ్ళు కూడా నిండని పిల్లాడు భారీ కొండచిలువతో ఉన్న వీడియో ఇప్పుడు నెటిజన్స్ ను షాక్ లోకి నెట్టేస్తోంది.
"""/" /
ప్రముఖ జర్నలిస్ట్ LP పంత్ @pantlp అనే యూజర్ నేమ్ తో ట్విట్టర్ లో ఈ వీడియోను షేర్ చేయగా అది వెలుగు చూసింది.
ఈ వీడియోని చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.'బొమ్మపాము చూస్తేనే భయపడతాం అలాంటిది అంతపెద్ద కొండ చిలువతో ఆడుకోవడం ఏంటి?' ఒకరు కామెంట్ చేస్తే, 'ఆ కొండచిలువ బహుశా ఆ పిల్లాడికి మంచి స్నేహితుడు అయి ఉంటుంది' అని కామెంట్ చేస్తున్నారు.
మరికొందరు అయితే 'ఇది చాలా భయంకరమైన చర్య' అంటూ కామెంట్ చేయడం ఇక్కడ గమనించవచ్చు.