చిన్నారి మిర్రర్ గేమ్.. నెటిజన్లను తెగ నవ్విస్తుంది..?
TeluguStop.com

చిన్నపిల్లలని ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండి.చిన్నపిల్లలు ఏం చేసిన ఎంతో ముద్దు ముద్దుగా ఉంటుంది.


ఎంత అల్లరి చేసినా చూడాలనిపిస్తుంది.కొన్ని సార్లు చిన్న పిల్లలు ఆడుకునే తీరు ఎంతగానో నవ్వును తెప్పిస్తూ ఉంటుంది.


ఇక చిన్నారులు చేసే ఏ పని చూసినా మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని అందిస్తూ ఉంటుంది.
తాజాగా ఇక్కడొక చిన్నారి చేసింది చూస్తే ఎవరికైనా నవ్వు రావాల్సిందే.ప్రస్తుతం ఓ చిన్నారికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ చిన్నారి ఆడుకున్న తీరుకి నెటిజన్లు అందరూ ఫిదా అయిపోతున్నారు.ఇంతకీ ఆ చిన్నారి ఏం చేశాడు అంటారా.
తల్లిదండ్రులతో కలిసి పెద్ద మాల్ కు వెళ్లిన చిన్నారి అక్కడే ఉన్న ఒక పెద్ద అద్దం ముందుకు వెళ్ళాడు.
అద్దంలో తనని తాను చూసి ఎంతో ఆశ్చర్యపోయారు చిన్నారి.అద్దంలో కనిపించేవి బొమ్మ అనుకున్నాడు.
అద్ధం పక్కకి రాగానే ఆ బొమ్మ కనిపించలేదు.దీంతో మళ్లీ అద్దం ముందుకు వచ్చి చూసేసరికి బొమ్మ కనిపించింది.
ఇక అద్దం లో కనిపిస్తున్న బొమ్మ అచ్చం తనలాగే ఉంది అని మురిసిపోయాడు ఆ చిన్నారి.
ఇలా పలు సార్లు అద్దం పక్కకి ముందుకి కదులుతూ తెగ ఎంజాయ్ చేశాడు.
ఇక దీనికి సంబంధించిన వీడియోని ఇండియన్ యాక్టర్ కమెడియన్ డ్యాన్సర్ అయిన జావేద్ జాఫెరి ట్విట్టర్లో పోస్టు చేయగా.
నెటిజన్లందరిని ఫిదా చేస్తోంది ఈ వీడియో.
ఈ జాగ్రత్తలు తీసుకుంటే అలసట అల్లాడిపోవాల్సిందే!