తల్లి లైవ్ లో మాట్లాడుతుండగా…. పెయింటింగ్ పట్టుకొచ్చిన చిన్నారి!

ఏమి మహమ్మారో ఏమో గానీ చిన్న నుంచి పెద్ద వరకు ప్రతి ఒక్కరూ కూడా నానా తిప్పలు పడుతున్నారు.

ఆ మీడియా,ఈ మీడియా అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇళ్లలో నుంచే తమ కార్యకలాపాలు కొనసాగించాల్సి వస్తుంది.

ఇలాంటి సమయంలో చాలా మంది తమ భాద్యతలు నిర్వర్తించే క్రమంలో ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా ఒక భాగమై పోతున్నారు.

ఆ మధ్య ఒక న్యూస్ రిపోర్టర్ ఇంటి నుంచి లైవ్ చేస్తున్న సమయంలో ఆమె తండ్రి అర్ధనగ్నంగా అటుగా రావడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

తాజాగా అలాంటి వీడియో ఒకటి బయటకు రాగా.అందులోని చిన్నారికి అందరూ ఫిదా అవుతున్నారు.

అసలు వివరాల్లోకి వెళితే.లండన్‌ స్కూల్‌ ఆఫ్ ఎకనమిక్స్‌లో పనిచేసే డాక్టర్ క్లారే వెన్‌హమ్‌ ఇటీవల ఓ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

కరోనాపై ఆమె మాట్లాడుతుండగా.క్లారే కుమార్తె స్కార్‌లెట్‌ తాను వేసిన యూనికార్న్ పెయింటింగ్‌తో రూమ్‌లోకి వచ్చింది.

ఆ తరువాత దీన్ని ఎక్కడ పెట్టాలంటూ తల్లిని అడగ్గా.క్లారే ఓ సెల్ఫ్‌లో పెట్టమని చూపించింది.

దానికి ఇంటర్వ్యూ చేస్తున్న ఫ్రేజర్‌ యూనికార్న్ చాలా బావుందని, దాన్ని కింద షెల్ఫ్‌లో పెట్టాలని క్లారేకి తెలిపారు.

ఇక ఆ తరువాత తల్లి వద్దకు వచ్చిన స్కార్‌లెట్‌ అతడి పేరు ఏంటమ్మా అని ప్రశ్నించింది.

దానికి క్లారే క్రిస్టియన్‌ ఫ్రేజర్‌ అని సమాధానం ఇచ్చారు.ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా ఆ చిన్నారికి అందరు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

మరోపక్క ఇలా ఇంటి నుంచే ఇంటర్వ్యూలలో పాల్గొనే చిన్న పిల్లల తల్లిదండ్రులకు ఈ తిప్పలు తప్పవంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

పాకిస్థానీ మహిళను ఉద్యోగం నుంచి తీసేసిన టెస్లా.. ఆ షాక్‌తో..??