న్యూట‌న్ సిద్ధాంతం వ‌ల్లే క‌రోనా అంటూ చిన్నారి లేఖ‌.. తెగ న‌వ్వుకుంటున్న నెటిజ‌న్లు..

ఇప్పుడు క‌రోనా ప్ర‌పంచాన్ని ఎంత‌లా అత‌లాకుంత‌లం చేస్తుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన‌ ప‌ని లేదు.

మొద‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు అనేక ప్రాంతాల‌ను క‌రోనా క‌మ్మేసింది.అది ఉండ‌ని ఊరు లేదు, అది చేర‌ని ప్రాంతం లేదు అన్న‌ట్టు ప్ర‌పంచాన్ని మొత్తం గ‌డ‌గ‌డ‌లాడిస్తోంది.

అయితే దానికి వ్యాక్సిన్లు వ‌చ్చినా కూడా.అనేక వేరియంట్ల‌లో ఆ క‌రోనా వస్తోంది.

ఇప్ప‌టికే డెల్టాతో పాటు ఒమిక్రాన్ వేరియంట్లు ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్నాయి.ఇలా నిత్యం క‌రోనా ఏదో ఒక రూపంలో ప్ర‌పంచాన్ని వెంబ‌డిస్తూనే ఉంది.

రెండేండ్లుగా ఈ క‌రోనా మ‌హ‌మ్మారి మ‌న‌ల్ని భ‌య‌పెడుతూనే ఉంది.చైనాలో పుట్టిన ఈ రాకాసి వైర‌స్ ఇప్ప‌టికీ అనేక వేరియంట్ల రూపంలో వ‌స్తోంది.

అయితే ఇప్ప‌టికే క‌రోనా విష‌యంలో అనేక వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉన్నాయి.

అయిత ఇప్పుడు ఓ చిన్నారి రాసిన లేఖ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

ఇది చూసిన వారంతా కూడా తెగ న‌వ్వుకుంటున్నారు.ఎందుకంటే అత‌ను క‌రోనాను న్యూట‌న్ సిద్ధాంతాన్ని ఆడ్ చేసి ఫ‌న్నీగా చెప్పుకొచ్చాడు.

పైగా అందులో ఉన్న విష‌యం ఇప్పుడు స్ప‌ష్టంగా జ‌రుగుతోంది కూడా. """/"/ ఇందులో ఆ చిన్నారి కరోనా పెరిగితే చ‌దువు త‌గ్గుతోంది.

అదే క‌రోనా త‌గ్గితే చ‌దువు పెరుగుతోంది.అని ఈ రెండింటి మ‌ధ్య విలోమ సిద్ధాంతం ప‌ని చేస్తోందంటూ అద్భుతంగా చెప్పుకొచ్చాడు.

అంటే క‌రోనా ఎక్కువ‌యిన‌ప్పుడు స్కూళ్లు క్లోజ్ అవుతున్నాయి కాబ‌ట్టి చ‌దువు త‌గ్గిపోతోంది.అదే క‌రోనా తగ్గితే స్కూళ్లు ఓపెన్ అవుతున్నాయి.

దీంతో చ‌దువు ఆటో మేటిక్ గా పెరుగుతోందంటూ వివ‌రించాడు అత‌గాడు.ఇక ఆ కుర్రాడు రాసుకొచ్చిన ఆ లెట‌ర్ ను ఐఏఎస్ ఆఫీస‌ర్ త‌న సోష‌ల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.

దీంతో ఈ పోస్టు కాస్తా నెట్టింట్లో తెగ వైర‌ల్ అవుతోంది.

చుండ్రు సమస్యను దూరం చేసే సూపర్ సొల్యూషన్ ఇది..!