Vishva Karthikeya : ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. 50 కి పైగా సినిమాలు.. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా హీరో?
TeluguStop.com
తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత కొన్ని సినిమాలలో నటించి చాలా కాలం తర్వాత మళ్లీ హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన వారు చాలామంది ఉన్నారు.
అటువంటి వారిలో నటుడు విశ్వ కార్తికేయ( Vishva Karthikeya ) కూడా ఒకరు.
కార్తికేయ సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు పూర్తి అయ్యింది.
మరి ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించారు. """/" /
గోరింటాకు, జానకి వెడ్స్ శ్రీరామ్,( Janaki Weds Sriram ) విష్ణు, లేత మనసులు, శివ శంకర్, అధినాయకుడు లాంటి చిత్రాల్లో కనిపించారు.
అంతే కాకుండా నటనతో ప్రేక్షకులను మెప్పించడంతో పాటు నంది, అంతర్జాతీయ , ఇంటర్నేషనల్ ఫిల్మ్ అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు కార్తికేయ.
ఇక జనసేన సినిమాతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చారు.ఇకపోతే ప్రస్తుతం కలియుగం పట్టణంలో అంటూ ఒక ఇంటెన్స్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నాడు.
నాని మూవీ వర్క్స్, రామా క్రియేషన్స్ ప్రొడక్షన్ అధినేతలు డా.కే.
చంద్ర ఓబుల్ రెడ్డి, జీ మహేశ్వర రెడ్డి, కట్టం రమేష్ సంయుక్తంగా కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ మూవీలో ఆయూషి పటేల్( Aayushi Patel ) హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే.
"""/" /
ఈ సినిమాతో రమాకాంత్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టైటిల్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.
ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.ఇలా ఉంటే విశ్వ కార్తికేయ సినిమా ( Vishva Karthikeya MOVIE )ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో మూవీ మేకర్స్ అందరూ కూడా శుభాకాంక్షలు తెలిపారు.
కార్తికేయ ఎన్త్ అవర్ అనే పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు.
యాక్షన్ అడ్వెంచర్‌గా రాబోతున్న ఈ మూవీ దర్శక నిర్మాణ బాధ్యతలను రాజు గుడిగుంట్ల తీసుకున్నారు.
ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.చైల్డ్ ఆర్టిస్టుగా ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్రను వేసుకున్న విశ్వ కార్తికేయ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో కొత్త సినిమాకి కమిట్ అయిన రవితేజ…డైరెక్టర్ ఎవరంటే..?