చిలకలూరిపేట బైపాస్ పనులు పూర్తి చేస్తామన్న రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని

పల్నాడు జిల్లా చిలకలూరిపేట; 2023 కల్లా చిలకలూరిపేట బైపాస్ పనులు పూర్తి చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

పల్నాడు జిల్లా చిలకలూరిపేట బైపాస్ నిర్మాణ పనులను అధికారులతో కలసి మంగళవారం మంత్రి రజిని పరిశీలించారు.

బైపాస్ నిర్మాణానికి సంబంధించి ఉన్న అడ్డంకులన్నీ ఒక్కొక్కటి తొలగించెలా చర్యలు తీసుకున్నామన్నారు.రూ 700 కోట్లతో నిర్మిస్తున్న 16.

34 కి.మీ చిలకలూరిపేట బైపాస్ నిర్మాణం 2023 కల్లా పూర్తిచేసేలా పనులు వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.

వైకాపా ప్రభుత్వంలో చిలకలూరిపేట ప్రజల కలగా ఉన్న బైపాస్ నిర్మాణం పూర్తి కావడం సంతోషంగా ఉందన్నారు.

మంత్రితోపాటు అధికారులు పాల్గొన్నారు.

విజయ్ దేవరకొండతో సినిమా.. వారం వరకు భయపడ్డా.. ప్రియాంక జవాల్కర్ కామెంట్స్ వైరల్!