రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కుల గణన హర్షించదగ్గ విషయం చీకూరి లీలావతి

సూర్యాపేట జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేపట్టడం హర్షించదగ్గ విషయమని, బీసీలకు న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని,బీసీలలో 100కు పైగా సబ్ కులాలు ఉన్నాయని, కుల గణన వల్ల బీసీలకు, ఓబిసీలు,ఎస్సీలకు,ఎస్టీలకు సామాజిక న్యాయం జరుగుతుందని బీసీ విద్యార్థి నాయకురాలు,విన్నపం ఒక పోరాట వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు సోమవారం ఓ పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.

ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన పత్రంలో అవసరం లేని కాలాలను కూడా ప్రభుత్వం గమనించి తొలగించాలన్నారు.

కేంద్ర ప్రభుత్వం కూడా తక్షణమే బీసీల కుల గణన చేయాలని బీసీలంతా గళం ఇప్పాల్సిన సమయం వచ్చిందన్నారు.

అలా చేస్తే బీసీలకి చట్ట సభల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు.

విశ్వక్ సేన్ మెకానిక్ రాఖీ తో సక్సెస్ సాధించాడా..?