అమెరికా రక్షణ శాఖ...పెంటగాన్ అధికారి..రాజీనామా..??

అమెరికాలో ప్రభుత్వ అధికారుల రాజీనామాలు జోరందుకున్నాయి.రక్షణ శాఖలో గతంలో జిమ్ మాటన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే అయితే ఆయన రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఉన్నత స్థాయి అధికారి వైట్ కూడా తన రాజీనమాని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.

తనకి జిమ్‌ మాటిస్‌తో కలిసి తమ దేశానికి సేవలు అందించే అవకాశం కలిపించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ట్విట్టర్ లో ఒక సందేశం కూడా పంపారు.

తనకు సహకరించిన సహచరులందరికీ కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని ఆమె తన ట్వీట్‌లో పేర్కొన్నారు.అయితే వీరు ఇద్దరూ రక్షణ శాఖకి రాజీనామా చేస్తున్నట్లుగా ఆ శాఖ ప్రతినిధులు దృవీకరించారు.

Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ అయితే ఆమె స్థానంలో చార్లెస్ ఈ సమ్మర్స్‌ పెంటగాన్‌ ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించారని తెలిపారు.

అయితే బోయింగ్‌ విమాన తయారీ సంస్థ మాజీ ఉపాధ్యక్షుడు పాట్రిక్‌ షనాహన్‌ అమెరికా కొత్త రక్షణ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన గతంలో తెలిసిందే.