ఆడపడుచులకు అండగా పెద్దన్నగా నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్.
TeluguStop.com
ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు.ముగ్గురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి , ఒకరికి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.
రాజన్న సిరిసిల్ల జిల్లా: ఆడపడుచులకు అండగా పెద్దన్నగా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు అన్నారు.
ఎల్లారెడ్డిపేట గ్రామపంచాయతీ ఆవరణలో ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, స్థానిక సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి , బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లతో కలిసి నలుగురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి , షాదీ ముబారక్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల ప్రకారమే ఆసరా పింఛన్, రైతుల కొరకు రైతుబంధు, రైతు భీమా 24 గంటల కరెంటు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్, ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గతంలో ఆడపిల్ల పెళ్లి చేయాలంటే పెద్ద వ్యాపారస్తుల తో అప్పు చేసి పెళ్లి చేయాల్సిన పరిస్థితి ఉండేదని నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఆడపిల్లలకు అన్ని వర్గాల ప్రజలకు కు అన్న గా అండగా ఉంటానని కల్యాణలక్ష్మి , షాదీ ముబారక్ పథకం కింద ఒక్కొక్కరికి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తున్నారని వారు అన్నారు.
పెళ్లి సమయంలో ఒక వేళ అప్పు చేసిన అప్పులు తీర్చే ధైర్యం తల్లిదండ్రులకు ఇచ్చి అండగా నిలిచిన నాయకుడు కెసిఆర్ వారిని ఆదుకుంటున్నామన్నారు.
రైతు కోసం రైతు బంధు, రైతు బీమా, రైతు సమావేశం ఏర్పాటు చేశారు.
రైతు వేదికల నిర్మాణం చేశామన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సంతోషంగా సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని సీఎం కోరిక అని తెలిపారు .
మహిళలు ఈ కళ్యాణలక్ష్మి డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని కోరారు.ఈ సందర్భంగా మహిళలు ముఖ్యమంత్రి కెసిఆర్ కు , రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్ , ఎంపిటీసీ సభ్యురాలు ఎలగందుల అనసూయ నర్సింలు , వార్డు సభ్యులు గడ్డమీది లావణ్య, జవాజీ లింగం , ద్యాగం లక్ష్మీనారాయణ , పొందిళ్ల శ్రీనివాస్ గౌడ్ , కొడుమోజూ దేవేందర్ , మహిళా మండల అధ్యక్షురాలు అప్సరా అజ్జు , బిఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మేగి నరసయ్య , ఎలగందుల నర్సింలు , నందికిషన్ , ఎలగందుల బాబు , అజీమోద్దీన్ , మెండే శ్రీనివాస్ యాదవ్, , కొత్త మల్లయ్య , గౌరీ గారి నర్సయ్య ,నాగుల ప్రదీప్ గౌడ్ , శ్రీ గాధ సంతోష్ , సోషల్ మీడియా ప్రతినిధి గంట వెంకటేష్ గౌడ్ , వి ఆర్ ఏ రాజు , తదితరులు పాల్గొన్నారు.
సెల్ఫీ పిచ్చితో కూతుర్ని గంగలో వదిలేసిన తల్లి.. చివరకి?