నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయనిది వరం – ఎంపీపీ పిల్లి రేణుక కిషన్

నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది అని ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ బుధవారం అన్నారు.

ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక గ్రామపంచాయతీ ఆవరణలో లబ్ధిదారులు ఓలాద్రి సతీష్ రెడ్డి,కే శ్రీనివాస్ రెడ్డి, ద్యాగం రాజేష్,మానుక రజిత, వంగ లక్ష్మి, ఎడ్ల రాజ నర్సయ్య లకు 1.

65 లక్షల పంపిణీ ని ఎంపీపీ పిల్లి రేణుక, జడ్పిటిసి చీటీ లక్ష్మణ్ రావు, బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి లు పంపిణీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆస్పత్రులలో చికిత్స చేయించుకుని ఖర్చుల పాలైన కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి లబ్ధిదారులకు చెక్కులు మంజూరు చేస్తుందని గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తమ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని పేదలను ఆర్థిక అభివృద్ధిగా ఎదగాలనే లక్ష్యం ముఖ్యమంత్రి కెసిఆర్ దని కొనియాడారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓగ్గు రజిత యాదవ్,మండల సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హరి, మండల సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, సింగిల్ విండో డైరెక్టర్ నేవూరి వెంకట నరసింహారెడ్డి, ఎంపీటీసీ పందిర్ల నాగరాణి పరుశరామ్ గౌడ్, వార్డు సభ్యులు కొడుమోజు దేవేందర్,బి ఆర్ ఎస్ నాయకులు మీసం రాజం, మేగీ నరసయ్య,ఎనగందుల నరసయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు ఎడ్ల సందీప్, మాద ఉదయ్, చందనం శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

దేవర సెప్పినాడంటే చేస్తాడని.. ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే సినిమాల్లో నటిస్తున్నాడుగా!