మధుమేహం ఉన్నవారు శనగలు తింటే ఏం అవుతుందో తెలుసా?
TeluguStop.com
మధుమేహం లేదా షుగర్ వ్యాధి.నేటి కాలంలో ఆడ, మగ అనే తేడా లేకుండా ఎందరినో పట్టి పీడుస్తున్న సమస్య ఇది.
రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటమే మధుమేహం.ఈ వ్యాధి నేటి కాలంలో కేవలం పాతిక, ముప్పై ఏళ్లలోనే చాలా మంది ఎదుర్కొంటున్నారు.
ఆహారపు అలవాట్లు, మారిన జీవన శైలి, శారీక శ్రమ లేకపోవడం, అతిగా ఒకే చోట కూర్చోవడం, మద్యం అలవాటు ఇలా రకరకాల కారణాల వల్ల మధుమేహం వ్యాధి ఏర్పడుతుంది.
ఇక మధుమేహం వ్యాధి ఒక్క సారి వచ్చిందంటే ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ముఖ్యంగా షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేసే ఆహారాలను డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.అయితే అలాంటి వాటిలో శనగలది ప్రత్యేక స్థానం.
శనగల్లో విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
కొవ్వు శాతం మాత్రం తక్కువగా ఉంటుంది.కాబట్టి, ఇవి తిన్నా బరువు పెరగరు.
అలాగే శనగలు తరచూ తీసుకుంటే.అందులో పుష్కలంగా ఉండే ఫైబర్ రక్తంలోని షుగర్, కొవ్వులను నియంత్రిస్తాయి.
ఇన్సులిన్ ప్రక్రియను మెరుగుపరుస్తుంది.కాబట్టి, మధుమేహం ఉన్న వారు శనగలను డైట్‌లో చేర్చుకుంటే చాలా మంచిది.
అయితే శెనగలను నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిది.శనగలతో మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
సాధారణంగా శాకాహారులు ప్రోటీన్ లోపం ఎక్కువగా కనిపిస్తుంది.అలాంటి వారు శనగలను డైట్‌లో చేర్చుకుంటే.
ప్రోటీన్ కొరత దూరం అవుతుంది.అలాగే నానబెట్టిన శనగలు తరచూ తీసుకుంటే.
అందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రియెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.అదే సమయంలో గుండె పోటు మరియు ఇతర గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్‌ను కూడా తగ్గిస్తుంది.
కొరటాల శివ నెక్స్ట్ సినిమా ఎవరితో చేస్తున్నాడు…