అమెరికాలో విందు గొడవ..చివరికి కాల్చుకునే వరకూ వచ్చింది

అమెరికాలో కాల్పుల ఘటనలు సర్వ సాధారణం అయ్యిపోయాయి.నెలలో ఒకటి రెండు సార్లు అమెరికాలో ఎదో ఒక ప్రాంతంలో తుపాకులు పేలుతూనే ఉంటాయి.

స్థానికంగా ఉన్న సంస్థలు తుపాకుల సంస్కృతి మంచిది కాదని ఎన్నో స్వచ్చంద సంస్థలు ప్రచారం చేస్తున్నా ఫలితం మాత్రం సూన్యమనే చెప్పాలి.

రెండు రోజుల క్రితమే ఓ పార్టీలో జరిగిన తుపాకి దాడి ఘటన మరువక ముందే అమెరికాలోని చికాగోలో తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది.

ఓ విందు వేడుకలో పాల్గొన్న యువకుల మధ్య గొడవ చిలికి చిలికి గాలివానలా కాల్చుకునే వరకూ వచ్చింది.

వివరాలోకి వెళ్తే.చికాగోలో కొందరు యువకులు ఓ ఇంట్లో విందు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు.

ఈ సమయంలోనే ఒక్క సారిగా వారి మద్య జరిగిన ఓ చర్చ వివాదంగా మారింది.

/br """/"/ దాంతో ఆ యువకుల్లో కొందరు తుపాకులు తీసి ఒకరిని ఒకరు కాల్చుకున్నారు.

ఈ ఘటనలో సుమారు 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.వారిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ఈ ఘటన ఆదివారం ఉదయం 12.30 గంటల సమయంలో చోటు చేసుకుంది.

భాదితులు అంతా 16 ఏళ్ళ నుంచీ 40 ఏళ్ళ మధ్య వారేనని తెలుస్తోంది.

తుపాకులతో కాల్పులు జరిపిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఓటు వేయని వాళ్లకు అలాంటి శిక్ష వేయాలి.. పరేష్ రావల్ షాకింగ్ కామెంట్స్ వైరల్!