చియా సీడ్స్ డైట్ లో ఉంటే చాలు.. ఎలాంటి రోగమైన ఇట్టే నయం..!

మనిషి శరీరాన్ని ఫిట్ అండ్ హెల్దీగా చేయాలంటే ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగా ఉండాలి.

ఇక ఆరోగ్యం కోసం చాలా మంది పండ్లు, కూరగాయలు తీసుకోమని సూచిస్తూ ఉంటారు.

అయితే సీడ్స్ కూడా ఆరోగ్యానికి చాలా లాభం లభిస్తుంది.అందులో ముఖ్యమైనవి చియా సీడ్స్.

( Chia Seeds ) ఇవి ప్రకృతిలో విరివిగా లభిస్తాయి.అలాగే చియా సీడ్స్ లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

ఎందుకంటే ఇందులో కార్బోహైడ్రేట్లు,( Carbo Hydrates ) ప్రోటీన్లు,( Proteins ) ఫ్యాట్, ఫైబర్, ఎనర్జీ, ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీస్, సెలీనియం, విటమిన్ ఏ, బి1, బి2, ఇ లాంటి ఎన్నో శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి.

"""/" / కాబట్టి వీటిని తీసుకుంటే ఎన్నో అంతుచిక్కని ప్రయోజనాలు లభిస్తాయి.

వీటిని పరగడుపున తీసుకోవడం వలన మరింత ప్రయోజనాలు లభిస్తాయి.ఎందుకంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు,( Anti-Oxidants ) యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాల కారణంగా రోగనిరోధక శక్తి( Immunity Power ) పెరుగుతుంది.

దీంతో వివిధ రకాల వ్యాధుల నుంచి పోరాడే శక్తి లభిస్తుంది.చియా సీడ్ వాటర్ తో కూడా ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

చియా సీడ్స్ లో పుష్కలంగా లభించే ఫైబర్ కారణంగా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.రోజు ఉదయాన్నే చియా సీడ్స్ తీసుకుంటే మలబద్ధకం లాంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.

"""/" / దీంతో అజీర్తి ( Indigestion ) సమస్య ఉండదు.చియా సీడ్స్ లో ఉండే కొన్ని రకాల పోషకాల కారణంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా నియంత్రణలో ఉంటాయి.

మధుమేహం( Diabetes ) వ్యాధిగ్రస్తులైతే తప్పకుండా వీటిని డైట్లో భాగం చేసుకోవాలి.వీటిని తీసుకుంటే రక్తపోటు సైతం నియంత్రణలో ఉంటుంది.

ఇక ఇందులో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్ లాంటి మినరల్స్ వలన ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

కాబట్టి ఫిట్ గా ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయాన్నే చియా సీడ్స్ ను తీసుకోవడం తప్పనిసరి.

వీటిని రోజు పరుగడుపున తీసుకోవడం వలన మంచి ఆరోగ్యం మీ సొంతం.

తక్కువ టైమ్ లో పొడవాటి జుట్టును పొందడానికి ఈ పవర్ ఫుల్ రెమెడీని పాటించండి!!