ఇల్లంతకుంటలో చత్రపతి శివాజీ మహారాజ్ వర్ధంతి వేడుకలు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల భారతీయ జనతా పార్టీ( Bharatiya Janata Party ) కార్యాలయంలో శ్రీ ఛత్రపతి శివాజి మహారాజ్ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా బిజెపి మండల అధ్యక్షులు బెంద్రం తిరుపతిరెడ్డి మాట్లాడుతూ భారత మరాఠ సామ్రాజ్యన్ని నిర్మించిన మహనీయునీ 50 సంవత్సరాల జీవిత కాలం దేశ ప్రజలకు స్ఫూర్తి దాయాకమనీ కొనియాడుతూ, వారి ఆశయాలసాధనకై యువత కృషి చేయాలానీ అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జాయింట్ కన్వీనర్ బత్తిని స్వామి,జిల్లా బీజేపీ యువ మోర్చా ఉపాధ్యక్షులు బొల్లారం ప్రసన్న, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు గజ్జల శ్రీనివాస్( Gajjala Srinivas ), మండల బీజేపీ ఉపాధ్యక్షులు బోయిని రంజిత్, బీజేపీ నాయకులు చుక్క రమేష్, కోమటిరెడ్డి అనిల్, చల్లూరి భాను, గడ్డమిది వినయ్, బొంగోని శ్రీనివాస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
దుబాయ్ ట్రిప్.. డీజీపీ కూతురు రన్యా రావ్ కు దక్కిన కమిషన్ ఎంతో తెలుసా?