చెస్ ఆడుతుండగా పిల్లాడి వేలు విరిచేసిన రోబో..!
TeluguStop.com
టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది.నానాటికీ అభివృద్ధి చెందుతోంది.
టెక్నాలజీ తెచ్చే మార్పులను ఊహించడం కూడా కష్టంగా మారింది.మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా సాంకేతికత రూపాంతరం చెందుతోంది.
అయితే ఒక్కోసారి ఈ టెక్నాలజీ మార్పులు మానవులకు మేలు చేయకపోగా.కీడు చేస్తున్నాయి.
అలాంటి ఘటనే జరిగింది మాస్కోలో.అసలేం జరిగిందంటే.
అది చెస్ ఓపెన్ టోర్నమెంట్.చెస్ గురించి తెలిసిన వారంతా ఆ పోటీలను చాలా శ్రద్ధగా గమనిస్తున్నారు.
అందులోనూ ముఖ్యంగా ఓ పిల్లాడికి, రోబోకు మధ్య పోటీ జరుగుతోంది.ఏడేళ్ల ఆ బాలుడు రోబోను దీటుగా ఎదుర్కొంటున్నారు.
రోబో కూడా అంతే ధాటిగా బదులిస్తోంది.వారి మధ్య పోటీ రసవత్తరంగా సాగుతోంది.
రోబోకు, మనిషికి జరుగుతున్న పోటీలో ఎవరూ గెలుస్తారన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో ఉన్న తరుణంలోనే ఎవరూ ఊహించని ఘటన జరిగింది అక్కడ.
ఆటలో భాగంగా రోబో బాలుడి పావును తొలగించి అక్కడ తన పావును పెట్టేందుకు ప్రయత్నించింది.
"""/" /
రోబో తన పావును పూర్తిగా పెట్టకముందే ఆ బాలుడు తన పావును కదిపాడు.
ఈ క్రమంలోనే రోబో చేయి కింద ఆ బాలుడి వేళ్లు ఇరుక్కుపోయాయి.పక్కనే ఉన్న వారు అప్రమత్తమైన రోబో నుండి పిల్లాడి చేతిని విడిపించారు.
రోబో తన స్టెప్ ను పూర్తి చేయకముందే పిల్లాడు అది గమనించకుండా తన పావును కదిపాడని పోటీ నిర్వాహకులు తెలిపారు.
ఇందుకు సంబంధించి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Boyle Sports Customer Support And Service Quality: A Practical Guide For UK Players