విజయవాడ: రాధ రంగా మిత్ర మండలి చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో పునర్విభజన చేస్తూ 26 జిల్లాలు చేస్తుంది.
కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ కృష్ణా జిల్లా గా నామకరణం చేసింది.కృష్ణా జిల్లా లో రెండో భాగానికి వంగవీటి మోహన రంగ పేరు పెట్టాలని కోరుతున్నాం.
ఇది రాధ రంగ మిత్ర మండలి కోరిక మాత్రమే కాదు, ప్రజల ఆకాంక్ష కూడా.రాధ రంగ మిత్ర మండలి తరపున ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేస్తున్నాం.
వైయస్సార్ కు మంచి మిత్రులు రంగా.కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా, కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలి.
తూర్పు, పశ్చిమ, ప్రకాశం జిల్లాలో కూడా ఆయా జిల్లాలకు రంగ పేరు పెట్టాలని కోరుతున్నారు.కానీ రంగా పుట్టి పెరిగిన జిల్లా కృష్ణా జిల్లాకు రంగా పేరు పెట్టాలని కోరుతున్నాం.
ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం వస్తే తప్పకుండా కలిసి విజ్ఞప్తి చేస్తాం.సిఎం సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం.
క్లిక్ పూర్తిగా చదవండి