భారీ వర్షాలతో అతలాకుతలం అవుతోన్న చెన్నై..
TeluguStop.com
ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో చెన్నై అతలాకుతలం అవుతున్నాయి.గత మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
చెన్నైలో వర్షాలతో ఇప్పటి వరకు ఇద్దరు మృతిచెందారు.పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
రోడ్లపైకి వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.దీంతో అప్రమత్తమైన అధికారులు పలు ప్రాంతాల్లో సబ్ వేలు మూసివేశారు.
ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.
ఈ సమయంలో జాలర్లు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.కాగా, ఈ నెల 5వ తేదీ వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
మరోవైపు పాఠశాలలకు తమిళనాడు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ప్రజలు కూడా అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించారు.
God Of Coins Player Safety And Responsible Gambling (UK)