ఓ ప్రయాణికుడు తోటి ప్రయాణికులను బెంబేలెత్తించాడు.. కోతి, పాముతో సహజీవనం?

ఎవరి పిచ్చి వారిదంటారు.అయితే వారి పిచ్చితో వారికి ఇబ్బంది కలిగితే పర్వాలేదు కానీ, పక్కవారికి ఇబ్బంది కలిగితేనే ప్రమాదం.

ఇక్కడ సరిగ్గా అలాంటిదే జరిగింది.ఓ ప్రయాణికుడి చెందిన బ్యాగును చెక్ చేయగా అందులో కోతి పిల్ల, పాము, తాబేలు పిల్లలు కనిపించాయి.

దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు.చెన్నై ఎయిర్ పోర్టులో జరిగిన ఈ ఘటన అక్కడి ప్రయాణికులను బెంబేలెత్తేలా చేసింది.

ఇందుకు సంబంధించి ఎయిర్ పోర్టు అధికారులు ట్వీట్టర్ లో పేర్కొన్నారు.వివరాల్లోకి వెళితే.

బ్యాంకాక్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడికి చెందిన బ్యాగ్ కదలడం అక్కడి ప్రయాణికులను భయపడేలా చేసింది.

దాంతో వారు అక్కడి అధికారులకు చెప్పగా ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీ చేశారు.

దాంతో భయంకరమైన దృశ్యం అక్కడ బయల్పడింది.ఆ బ్యాగులో బ్రజ్జా జాతికి చెందిన కోతి పిల్ల, 15 కింగ్ స్నేక్స్, 5 కొండ చిలువల పిల్లలు, రెండు తాబేలు పిల్లలను చూసి అధికారులు సైతం భయబ్రాంతులకు గురయ్యారు.

తరువాత వాటిని వారు స్వాధీనం చేసుకున్నారు. """/"/ అయితే అవన్నీ బ్రతికే ఉండటం కొసమెరుపు.

తీరా విచారణలో తేలింది ఏమిటంటే వాటిని ప్రయాణికుడు అక్రమంగా తరలిస్తున్నాడని.అదేవిధంగా వాటన్నిటినీ థాయ్ ఎయిర్ వేస్ ద్వారా తిరిగి స్వదేశానికి పంపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

ఇక ఈ విషయాన్ని ఛేదించిన అధికారులను ఎయిర్ వేస్ సిబ్బంది మెచ్చుకున్నారు.అలాగే ఈ విషయం తెలుసుకున్న ప్రయాణికులు హమ్మయ్య అంరు ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఇలాంటి సంఘటనలు జరగడం ఇది తొలిసారి మాత్రం కాదు.ఇలాంటివి గతంలో అనేకమార్లు జరిగాయని తెలుస్తోంది.

నామినేషన్ దాఖలు చేసిన కర్నూల్ వైసీపీ అభ్యర్థి ఏ.ఎండి.ఇంతియాజ్ ..