నేలపై పాకుతున్న బాలుడు.. అంతలోనే దూసుకొచ్చిన చిరుత.. చివరికి ఏమైందో తెలిస్తే

నెట్టింట ప్రతిరోజూ లక్షల కొద్దీ వీడియోలు ప్రత్యక్షమవుతున్నాయి.అయితే వాటిలో కొన్ని విపరీతంగా వైరల్ అవుతుంటాయి.

ఎందుకంటే ఇవి ఫన్నీగా అలాగే భయంకరంగా ఉంటాయి.తాజాగా అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాని కుదిపేస్తోంది.

ఈ వీడియోలో ఒక చిరుత పులి ఒక చిన్న బాలుడిని చంపేందుకు ప్రయత్నించింది.

దీనికి సంబంధించిన దృశ్యాలను ఆ బాలుడి తండ్రి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

ఇప్పుడు అది వైరల్ అవుతోంది.ఈ భయానక ఘటన బ్రిటన్‌లో వోర్సెస్టర్‌షైర్‌లో వెలుగు చూసింది.

వైరల్ అవుతున్న వీడియోలో ఒట్టో అనే ఓ చిన్నారి ఒక వైల్డ్ లైఫ్ పార్కులోని ఒక గదిలో నేలమీద పాక్కుంటూ ఎంట్రెన్స్ వద్దకు రావడం చూడొచ్చు.

ఇంతలోనే ఒక పెద్ద చిరుతపులి పిల్లోడిపై కన్నేసింది.ఆ బాలుడిని ఒక్కసారిగా నోటకరచుకొని తినేద్దాం అనుకుంది.

క్షణాల్లోనే బాలుడిపైకి దూకింది.అయితే అదృష్టం కొద్దీ ఒక గాజు డోర్ పులి బాలుడు మధ్య అడ్డుగా నిలిచింది.

ఈ డోర్ క్లోజ్ అయ్యి ఉండటంతో పులి బాలుడుపై దాడి చేయలేకపోయింది.ఈ దృశ్యాలను బాలుడి తండ్రి బెన్ మిల్లర్ తన ఫోన్ కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

"""/"/ ఈ వీడియో కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.దీన్ని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

ఒక్క క్షణం పాటు బాలుడిని పులి ఎక్కడ చంపేసి తింటుంది ఏమోనని భయపడ్డామని చాలామంది కామెంట్లు పెడుతున్నారు.

పులి దూకిన ఫోర్స్ కు గాజు అదిరిందని.ఒకవేళ అది పగిలి పోతే అందరి ప్రాణాలకు ప్రమాదం వాటిల్లేదని అభిప్రాయపడుతున్నారు.

అయితే గతంలో కూడా ఒక చిన్న కుక్కపిల్ల పై ఒక కొండ సింహం దాడి చేయడానికి వచ్చింది.

అప్పుడు కూడా గాజు తలుపు అడ్డు ఉండటంతో ఆ కుక్క బతికిపోయింది.అయితే జంతువుల మధ్య నివసిస్తున్నప్పుడు ఎప్పుడూ కూడా తలుపులు లాక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లేదంటే ప్రాణాలు కూడా పోతాయి.తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

కల్కి సినిమాలో బుజ్జి (వాహనం) పాత్ర ఏంటంటే..?