కాలేజీ మీద చిరుత‌ దాడి.. స్టూడెంట్‌కు తీవ్ర గాయాలు

ఒక‌ప్పుడు అడ‌విలో మాత్ర‌మే క‌నిపించే చిరుత పులులు ఈ న‌డుమ ఇండ్ల‌లోకి వ‌చ్చేస్తున్నాయి.

స‌డెన్ గా ఎంట్రీ ఇచ్చేసి నానా బీభ‌త్సం సృష్టిస్తున్నాయి.ఎక్క‌డ ఎవ‌రి మీద ఎలా దాడి చేస్తాయో చెప్ప‌డం ఎవ‌రి త‌రం కావ‌ట్లేదు.

ఇక అడ‌వుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండే ప్రాంతాల జ‌నం అయితే ప్రాణాల‌ను అరచేతిలో పెట్టుకునే బ‌తుకుతుంటారు.

ఎందుకంటే ఎప్పుడు ఏ క్రూర జంతువు వ‌చ్చి దాడి చేస్తుందో తెలియ‌దు.మ‌రీ ముఖ్యంగా క్రూర మృగాల్లో చిరుత పులి దాడులే ఎక్కువ‌వుతున్నాయి.

ఇప్పుడు కూడా ఓ చిరుత ఇలాగే దాడి చేసింది.ఏకంగా ఓ కాలేజీ మీద దాడి చేసి స్టూడెంట్‌ను తీవ్రంగా గాయపర్చింది.

ఈ ఘ‌ట‌న ఒక్క‌సారిగా అంద‌రినీ క‌ల‌వ‌రానికి గురి చేసింది.ఇక చిరుత దాడితో కాలేజీలో ఉన్న స్టూడెంట్లు, టీచ‌ర్లు ఒక్క‌సారిగా భయంతో పరుగులు పెట్టారు.

ఈ ఆందోళ‌న‌లో తొక్కిస‌లాట జ‌రిగి కొందరు స్టూడెంట్లు గాయపడ్డారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘడ్‌ జిల్లాకు చెందిన ఛర్రా పోలీస్ స్టేషన్ ప‌రిధిలో ఈ విధంగా చిరుత దాడికి దిగిన‌ట్టు తెలుస్తోంది.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చెక్క‌ర్లు కొడుతోంది.ఈ కాలేజీ అడ‌వికి కొంచెం ద‌గ్గ‌ర‌గా ఉంది.

"""/" / ఇక క్లాసులు జ‌రుగుతున్న క్ర‌మంలో చిరుత పులి స‌డెన్ గా కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చేసింది.

వ‌స్తూనే ఓ క్లాస్ రూమ్ లో ఉండే స్టూడెంట్ మీద దాడి తీవ్రంగా గాయ‌ప‌రిచింది.

ఇక స్టూడెంట్లు, టీచ‌ర్ల అరుపుల‌కు ఆ పులి కాస్తా ఓ క్లాస్ రూమ్ లోకి వెళ్లి దాక్కుంది.

ఇక విషయం తెలుసుకున్న అటవీ సిబ్బంది రంగంలోకి దిగి దాదాపు 9గంటలు రిస్క్యూ నిర్వహించి అతిక‌ష్టం మీద ఆ చిరుత‌ను ప‌ట్టుకున్నారు.

ఈ చిరుత ఘ‌ట‌న‌లో గాయ‌ప‌డ్డ స్టూడెంట్ ఇప్పుడు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్నాడు.అతడి హెల్త్ బాగానే ఉందని డాక్ట‌ర్లు వివ‌రిస్తున్నారు.

ప్రభుత్వ పాఠశాలలో చదివి 593 మార్కులు.. త్రివేణి సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!