కొత్త కూలర్ కొనుగోలు చేస్తున్నారా.. కొనే ముందు ఈ ఫీచర్లు చెక్ చేయడం..!
TeluguStop.com
వేసవి కాలంలో మండుతున్న ఎండలతో బయట వడగాలులు, ఇంట్లో ఉక్కపోత.కాబట్టి వేసవికాలం వచ్చిందంటే ఇంట్లో కూలర్( Cooler ) లేదంటే ఏసి ఎప్పుడు ఆన్ లో ఉండాల్సిందే.
అయితే కొంతమంది మధ్యతరగతి కొనుగోలుదారులు ఎలాంటి కూలర్ కొనాలో తెలియక కాస్త ఇబ్బంది పడుతున్నారు.
ఎందుకంటే మార్కెట్లో ఒక దానికి మించి మరొకటి అన్నట్టుగా కూలర్లు విడుదల అవుతున్నాయి.
కొంతమంది అయితే కూలర్ల పై అవగాహన లేకపోవడంతో ఏదో ఒకటి కొనేసి ఆ తర్వాత ఇబ్బంది పడుతున్నారు.
మనం ఇప్పుడు అవసరాలకు తగ్గట్టు ఎలాంటి కూలర్ కొనుగోలు చేయాలో తెలుసుకుందాం.కూలర్ కొనుగోలు చేసే ముందు అసలు మనకు ఎలాంటి కూలర్ కావాలో ఎంపిక చేసుకోవాలి.
ఇంట్లో చిన్న చిన్న గదులు ఉండి, కూలర్ ను ఒక చోటు నుండి మరొక చోటికి సులువుగా తీసుకువెళ్లాలంటే.
పర్సనల్/ టవర్ కూలర్లు ( Tower Coolers ) సరిపోతాయి.ఒకవేళ ఒక గదిలో ఒకే చోట కూలర్ పెట్టాలనుకుంటే.
విండో కూలర్లు ( Window Coolers ) బెటర్.పెద్ద పెద్ద గదులలో కూలర్ పెట్టాలనుకుంటే.
డిజర్ట్ కూలర్లు కొనుగోలు చేయాలి. """/" /
ఇక కూలర్ కొనేటప్పుడు కూలర్ కెపాసిటీ కచ్చితంగా తెలుసుకోవాలి.
చిన్న గదిలలో ఉపయోగించే కూలర్ల కెపాసిటీ 20 లీటర్లు ఉంటే సరిపోతుంది.పెద్ద గదిలలో ఉపయోగించే కూలర్ల కెపాసిటీ 30 నుంచి 40 లీటర్లు ఉంటే సరిపోతుంది.
ఇక కూలర్ ప్యాడ్ ల విషయానికి వస్తే.మార్కెట్లో గడ్డి తరహాలో ఉండే యాస్పెన్ ప్యాడ్, తేనె తుట్టెను( Aspen Pad, Honey Wipe ) పోలిన హనీ ప్యాడ్ అందుబాటులో ఉన్నాయి.
యాస్పెన్ ప్యాడ్ ధర కాస్త తక్కువ, మన్నిక కూడా తక్కువే.హనీ ప్యాడ్ ధర కాస్త ఎక్కువ, మన్నిక కూడా ఎక్కువే.
"""/" /
ఇక ఎలాంటి ఫీచర్లు ఉండే కూలర్ కొనుగోలు చేయాలంటే.రిమోట్ కంట్రోల్ ఆప్షన్ ఉండే కూలర్లు కొనుగోలు చేయాలి.
రాత్రి వేళల్లో స్వింగ్, కూల్, స్లీప్ టైమర్ వంటి ఆప్షన్లు ఎంచుకోవడంలో రిమోట్ ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా కూలర్ లో డస్ట్ ఫిల్టర్ ఉండాలి.నీటిని నింపుకోవడంతో పాటు ఐస్ ఛాంబర్ ఉండే కూలర్ ఎంచుకోవాలి.
ముఖ్యంగా కూలర్ ఆన్ చేస్తే తక్కువ శబ్దం వచ్చే కూలర్ ను కొనుగోలు చేయాలి.
ఈ ఫీచర్లను ముందుగా పరిశీలించి అన్ని సక్రమంగా ఉంటే అప్పుడు కాస్త అధిక ధర ఉన్న కూడా కొనుగోలు చేయవచ్చు.
ఢిల్లీకి వెళ్తున్న రేవంత్ .. ఆ పదవుల భర్తీపై రానున్న క్లారిటీ