ఇపుడు ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ ఇలా చెక్ చేసుకోండి!

సాధారణంగా టోల్ ప్లాజాల వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు భారత ప్రభుత్వం (GOI) ఫాస్ట్‌ట్యాగ్ అని పిలిచే టోల్ వసూలు చేసే డిజిటల్ సిస్టమ్ అనే ఒకదానిని ప్రారంభించే విషయం అందరికీ తెలిసినదే.

ఇపుడు ఆన్‌లైన్‌లో ఫాస్ట్‌ట్యాగ్ రీఛార్జ్ చేసుకోవడం గురించి అనేక మార్గాలు మనకి అందుబాటులో ఉన్నాయి.

NHAI (నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా)చే నిర్వహించే ఫాస్ట్‌ట్యాగ్ ఒక ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ సిస్టమ్ అని చెప్పవచ్చు.

రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారు లింక్ చేసిన అకౌంట్ నుంచి నేరుగా టోల్ యజమాని అకౌంట్‌కు టోల్ పేమెంట్స్ ప్రారంభించింది.

"""/" / అన్ని ప్రైవేట్, వాణిజ్య వాహనాలకు ప్రభుత్వం ఫాస్ట్‌ట్యాగ్‌ని తప్పనిసరి చేసింది.

అయితే, హైవే టోల్ ప్లాజా వద్ద ఎలక్ట్రానిక్ టోల్ కలెక్షన్ (ETC)-రెడీ లేన్ ద్వారా డ్రైవ్ చేసేందుకు మీ ఫాస్ట్‌ట్యాగ్ వ్యాలెట్‌లో తగినంత బ్యాలెన్స్ ఉంచడం చాలా ముఖ్యమని గుర్తించాలి.

అయితే ఇక్కడ చాలామందికి ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి? ఆన్‌లైన్‌లో లేదా ఇతర పద్ధతుల ద్వారా ఎలా రీఛార్జ్ చేయాలో తెలియదు.

దానికోసం కింది స్టెప్స్ ఫాలో అయితే సరిపోతుంది. """/" / ఫాస్ట్‌ట్యాగ్ అకౌంట్లు అనేవి మీ అధికారిక బ్యాంక్ ID ద్వారా మాత్రమే క్రియేట్ అవుతాయని గుర్తు పెట్టుకోండి.

మీ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్‌ని చెక్ చేసేందుకు మీ ఫాస్ట్‌ట్యాగ్ IDని క్రియేట్ చేసిన బ్యాంక్ వెబ్‌సైట్‌ను మొదటగా విజిట్ చేయండి.

తరువాత బ్యాంక్ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేసిన తర్వాత ఫాస్ట్‌ట్యాగ్ కేటగిరీ కోసం సెర్చ్ చేయవలసి ఉంటుంది.

తరువాత మీ ఆధారాలను ఉపయోగించి పోర్టల్‌లోకి లాగిన్ కావాలి.ఇపుడు మీ మిగిలిన అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి వ్యూ ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ ఆప్షన్‌పై (Next) క్లిక్ చేయండి.

ఒకవేళ సదరు యాప్ మీ ఫోన్‌లో లేని యెడల గూగుల్ ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ ఓపెన్ చేయండి.

తరువాత ‘My FASTag App’ కోసం సెర్చ్ చేసి యాప్ డౌన్‌లోడ్ చేయండి.

తరువాత యాప్‌కి లాగిన్ చేస్తే సరిపోతుంది.

శ్రీవారి సన్నిధిలో మరో విషాదం.. లడ్డూ కౌంటర్లో అగ్నిప్రమాదం