రామ్మోహన్ నాయుడుకు చెక్.. రంగం లోకి బైరెడ్డి..?

తెలుగు దేశం పార్టీ లో.శ్రీకాకుళం జిల్లా నుంచి ఎంపీ గా ఎన్నికైన వ్యక్తి రామ్మోహన్ నాయుడు.

ఎర్రం నాయుడు తనయుడు గా రాజకీయాల్లోకి అడుగు పెట్టినా.అనతి కాలంలో లోనే.

తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.లోక్ సభలో ప్రభుత్వం పై.

విమర్శలు ఎక్కు పెడుతూ.చుక్కలు చూపిస్తున్నారు.

అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడలేని ఎన్నో విషయాలను గొంతెత్తి ప్రశ్నించారు.దాంతో వైసీపీ ఎంపీ ల కంటే.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నారు అనే పేరు తెచ్చుకున్నాడు.

ఇక వైసీపీ నుంచి గెలిచిన చాలా మంది ఎంపీలు అసలు సభకే రారు.

వచ్చిన అసలు ప్రశ్నలే అడగరు.ఒకవేళ అడిగినా.

తూ తూ మంత్రంగా మాట్లాడుతారు అనే విమర్శలు ఎక్కువ అయ్యాయి.దాంతో ఒక వైపు రామ్మోహన్ నాయుడు కు చెక్ పెట్టేందుకు.

మరో వైపు నికార్సైన మాటల మాంత్రికుడి నీ పట్టుకునే పనిలో వైసీపీ పార్టీ పడింది.

"""/"/ పార్టీలో గాట్టిగా వాయిస్ వినిపించే నికార్సైన యువతను వెతుకుతూ ఉంది.ఇంతలోనే యూత్ లీడర్ గా.

మాంచి యూత్ ఫాలోయింగ్ ఉన్న శాప్ చైర్మన్ బై రెడ్డీ సిద్దార్థ్ రెడ్డీ కనిపించి నట్టు తెలుస్తోంది.

మాంచి మాటకారి అయిన.సిద్దార్థ్ రెడ్డి ను కర్నూల్ ఎంపీ గా పార్లమెంట్ కు పంపితే.

పార్టీ పరువు కాపడు కోవచ్చు అని ఆలోచిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది.బై రెడ్డీ అయితే పార్లమెంట్ లో ప్రశ్నల వర్షం కురిపించడం తో పాటు.

నేతలకు గట్టి కౌంటర్ ఇవ్వగలడు అని ఆలోచిస్తున్నట్టు నేతల్లో టాక్ నడుస్తోంది. """/"/ రాష్ట్రం లో యువతను వైసీపీ వైపు తిప్పే పని సీఎం జగన్.

బై రెడ్డీ పైన ఉంచారు.బై రెడ్డీ సిద్దార్థ్ రెడ్డీ సైతం తన పనిని బాగానే నిర్వర్తిస్తూ ఉన్నాడు.

ఎక్కడ స్పోర్ట్స్ ఉంటే అక్కడికి వెళ్లి.వైసీపీ నీ పొగడ్తల వర్షం లో ముంచుతు ఉన్నారు.

పార్టీ పనులు వివరిస్తూ.అందరినీ కలుపుకోని పోతున్నారు.

దాంతో బై రెడ్డీ ను ఢిల్లీ పంపే ఆలోచన లో సీఎం జగన్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

చూడాలి మరి ఎన్నికల నాటికి ఇంకా ఏమేం మారుతాయి అనేది.

పుష్ప 2 స్టోరీ ఇదేనా..? పుష్ప క్యారక్టర్ కి రానా కి మధ్య సంబంధం ఏంటి..?