కొత్త ఫ్రిజ్ కొన్నపుడు ఈ వివరాలను పరిశీలించండి... లేదంటే?

ఇపుడు పేద ధనిక అనే తేడాలేకుండా అన్ని ఇండ్లలోని ఫ్రిజ్ వాడకం విరివిగా పెరిగింది.

కొన్ని రకాల పళ్ళను, కూరగాయలు రోజుల తరబడి నిలువ చేయాలంటే ఇది చాలా అవసరం.

అలాగే మనం ఉడకబెట్టిన ఫుడ్ ని కూడా ఇది రెండు రోజులపాటు నిలువ చేయగలదు.

దాంతో దీని ప్రయోజనాలు పెరగడంతో దాదాపు అందరూ దీన్ని వాడటం ఆరంభించారు.అయితే తాజాగా గృహావసరాల కోసం వాడే ఫ్రిజ్‌ల ఇంధన వినియోగానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడించాలని కేంద్ర బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ సంస్థ పేర్కొంది.

ఈ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది.ఇందుకు నిబంధనలను విడుదల చేస్తూ గురువారం ఓ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇక మీదట ప్రతి ఫ్రిజ్‌పై కొన్ని వివరాలు తప్పనిసరిగా వీటిని పొందుపరచాలని నిర్దేశించింది.

ఈ క్రింద పేర్కొన బడిన వివరాలన్నీ తప్పనిసరిగా పొందుపరచాలని నిర్దేశించింది.లేదంటే అలాంటి వస్తువులు వినియోగదారులకు విక్రయించకూడదని నిబంధనలు జారీ చేసింది.

ఈ నిబంధనలు అమల్లోకి వచ్చిన ఆరునెలల్లోపు ప్రతి ఫ్రిజ్‌పై ఈ వివరాలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కూడా పేర్కొంది.

"""/"/ H3 Class=subheader-styleఅవేమిటంటే./h3p 1.

బ్యూరో ఆఫ్‌ ఎనర్జీ ఎఫీషియన్సీ లోగో తప్పనిసరి.2.

తయారీదారు లేదా దిగుమతిదారు పేరు ఉండాలి.3.

బ్రాండ్‌పేరు ఎలాగూ ఉండాలి.4.

సదరు ఫ్రిడ్జ్ టైప్‌ గురించి రాయాలి.5.

మొత్తం సామర్థ్యం (వాల్యూమ్‌) 6.మోడల్‌ నంబర్‌ ఉండాలి.

7.తయారీ/ దిగుమతి చేసుకున్న సంవత్సరం వేయాలి.

8.ప్రత్యేక విశిష్ట సంఖ్య (యునిక్‌ సిరీస్‌ కోడ్‌) 9.

ఏడాదికి ఎన్ని యూనిట్ల విద్యుత్తు ఖర్చు చేస్తుంది తెలియజేయాలి.10.

స్టార్‌ లెవెల్‌ 11.లేబుల్‌ పీరియడ్‌ తప్పనిసరి.

గమనిక: పై వివరాలు లేకుండా ఆయా వస్తువులను కొనకూడదని వినియోగదారులకు మనవి చేసింది.

చంద్రబాబు తల్లికి వందనం స్కీమ్ అమలు వాళ్లకే.. ఆ నిబంధనలలో క్లారిటీ ఇదే!