ఈ గింజలతో షుగర్‌కు చెక్
TeluguStop.com
వాల్ నట్స్ శరీరానికి చాలా బాగా ఉపయోగపడతాయి.వాల్ నట్స్ ని అక్రోట్స్ అని కూడా అంటారు.
వాల్ నట్స్ లో ఉండే ప్రోటీన్స్ , మినరల్స్ ,విటమిన్ ఇ ,కే ,సి,ఏ,సోడియం, పొటాషియం, కాల్షియం, కాపర్, ఇలా అనేక రకాల పోషక విలువలు దీనిలో ఉన్నాయి.
వాల్ నట్స్ ని తినడం వల్ల ముఖ్యంగా మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.
పిల్లలకి వీటిని తినిపించడం వల్ల వారు చదువులో ఒత్తిడిని సులువుగా జయిస్తారు.ఈ వాల్ నట్స్ అధికంగా ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ ని కలిగి ఉండే కారణంగా గుండెకి సరఫరా అయ్యే రక్తం చిక్కబడకుండా, రక్త్రంలో గ్లూకోజ్ స్థాయి సమానంగా చేస్తూ గుండెని హార్ట్ ఎటాక్ నుంచి కాపాడుతుంది.
అంతేకాదు రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలో ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది.
అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ వాల్ నట్స్ రోజుకు నాలుగు చొప్పున తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవచ్చు.
"""/" /
వాల్ నట్స్ రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి.చర్మం ముడతలు పడకుండా కాంతివంతంగా చేయడంలో వీటికి మించిన వేరే డ్రై ఫ్రూట్స్ లేవు.
సంతాన సమస్యలు ఉన్నవారికి, వీర్యకణాల ఉత్పత్తి పెంచడానికి ఇది బాగా ఉపయోగ పడుతుంది.
శరీరంలో ఉండే చాలా అవయవాలమీద దీని ప్రభావం ఉంటుంది.అందుకే వాల్ నట్స్ అన్ని గింజలు కంటే ఎక్కువ రోగ నిరోధక శక్తి కలిగిన,ఎక్కువ ప్రయోజనాలు కలిగిన డ్రై ఫ్రూట్ గా వైద్యులు పేర్కొన్నారు.
చిన్న పిల్లలు,యుక్త వయస్సులు,ఇలా అన్ని రకాల వారు వాల్ నట్స్ ని రోజుకి ఒకటి నుండి ఐదు గింజల వరకూ తీసుకుంటే.
ముందుగానే చాలా రకాల సమస్యలని మనం కంట్రోల్ చేసుకోవచ్చు .
ఇదేందయ్యా ఇది…అల్లు అర్జున్ పార్టీ పెట్టి సీఎం అవుతారా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు!