విజయవాడలో వెలుగులోకి సంకల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ చీటింగ్

విజయవాడలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది.సంకల్ప సిద్ధి చైన్ లింక్ సంస్థ ఖాతాదారులను మోసం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కమీషన్ల ఆశ చూపి వేలాది మంది ఖాతాదారులుగా చేసుకున్నట్లు సమాచారం.ఇప్పటివరకు రూ.

1500 కోట్ల వరకు టర్నోవర్ జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.ఈ క్రమంలో సంకల్ప సిద్ధి నిర్వాహకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంస్థకు సంబంధించిన అకౌంట్లు, వాలెట్ లను పరిశీలిస్తున్నారు.విజయవాడ నగరంలో మొత్తం ఈ సంస్థకు సంబంధించి మూడు బ్రాంచ్ లు ఉండగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

అదేవిధంగా బాధితులు ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు రావాలని పోలీసులు సూచిస్తున్నారు.

TDP Janasena : టీడీపీ – జనసేన సమన్వయ కమిటీ భేటీ..!!