నయనతార, ఆమె భర్తపై చీటింగ్ కేసు నమోదు.. ఆస్తుల విషయంలో మోసం చేశారంటూ?

కోలీవుడ్ ఇండస్ట్రీలో ప్రేమించి పెళ్లి చేసుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న జోడీలలో నయనతార ( Nayanthara ) విఘ్నేష్ శివన్ జోడీ ఒకటి కావడం గమనార్హం.

నయనతార ప్రస్తుతం ఒక్కో సినిమాకు 10 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

విఘ్నేష్ శివన్ కు సైతం సినిమా ఆఫర్లు వస్తున్నా నయనతారకు వచ్చిన స్థాయిలో విఘ్నేష్ శివన్ కు ఆఫర్లు రావడం లేదు.

అయితే తాజాగా నయన దంపతులపై చీటింగ్ కేసు నమోదు కావడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

విఘ్నేష్ శివన్ ( Vignesh Shivan )సమీప బంధువులే ఈ కేసును నమోదు చేయడం గమనార్హం.

విఘ్నేష్ శివన్ బాబాయ్ నయన్ విఘ్నేష్ లపై ఉమ్మడి ఆస్తి అపహరణ కేసును నమోదు చేశారు.

విఘ్నేష్ శివన్ తండ్రి ఉమ్మడి ఆస్తిని తమకు సమాచారం ఇవ్వకుండా విక్రయించి మోసం చేశారని పేర్కొన్నారు.

"""/" / విఘ్నేష్ శివన్ తమ ఆస్తిని కొనుగోలు చేసిన వాళ్లకు డబ్బులను తిరిగి ఇచ్చి తమ ఆస్తి తమకు దక్కేలా చూడాలని ఫిర్యాదులో విఘ్నేష్ శివన్ బాబాయ్ పేర్కొన్నారు.

తిరుచ్చీ డీఎస్పీ ఈ కేసును దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

రాబోయే రోజుల్లో ఈ కేసుకు సంబంధించి ఎలాంటి మలుపులు చోటు చేసుకుంటాయో చూడాలి.

నయన్ విఘ్నేష్ ఈ కేసు విషయంలో ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. """/" / పెళ్లి తర్వాత తమ తప్పేం లేకపోయినా నయనతార విఘ్నేష్ శివన్ వేర్వేరు వివాదాల్లో చిక్కుకోవడం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

విఘ్నేష్ శివన్ తల్లి, సోదరిపై కూడా కేసు నమోదైంది.ఈ వివాదాన్ని పెద్దది చేయకుండా విఘ్నేష్ దంపతులు సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

రాబోయే రోజుల్లో విఘ్నేష్ నయనతార ఏం చేస్తారో చూడాల్సి ఉంది.

తెలంగాణలో పంచాయితీ ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్