నాగ చైతన్య జాతీయ మీడియాను ఆ ప్రశ్నలు వేయకుండా ఆపగలడా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో సామ్ చైతన్య విడాకుల అంశం అందరిని షాక్ కు గురి చేసిందనే చెప్పాలి.

ఎంతో అన్యోన్యంగా ఉండే సమంత, నాగ చైతన్య విడాకులు తీసుకుంటున్నారని తెలిసి టాలీవుడ్ లో అభిమానులతో పాటు మిగతా వారు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు.

అసలు వీరిద్దరూ విడిపోతారని ఎవ్వరు ఊహించలేదు అందుకే ఈ విడాకులు విషయాన్నీ అభిమానులు ఇప్పటికి జీర్ణించు కోలేక పోతున్నారు.

ఇక విడాకుల తర్వాత అటు సమంత, ఇటు నాగ చైతన్య ఇద్దరు కూడా తమ కెరీర్ లపైనే ద్రుష్టి పెట్టారు.

కానీ వీరి విడాకుల విషయంలో మీడియా మాత్రం కొద్దిగా ఎక్కువుగానే ఇన్వాల్వ్ అయ్యారు.

ఇప్పటికి వీరి విషయంలో ఏదొక రూమర్ వస్తూనే ఉంది.విడాకుల అంశం ముగిసింది అని అనుకోగానే తెరపైకి నాగ చైతన్య, శోభిత దూళిపాళ్ల డేటింగ్ విషయంపై రకరకాల రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి.

ఈ క్రమంలోనే చైతూ రెండు సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఆయన నటించిన థాంక్యూ సినిమా జులై 22న రాబోతుంటే.

హిందీ డెబ్యూ మూవీ అయినా లాల్ సింగ్ చద్దా ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.

అందుకే చైతూ మీడియా ముందుకు వస్తూ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.ఈ నేపథ్యంలో చైతూకి శోభిత తో డేటింగ్ గురించిన ప్రశ్న ఎదురవ్వడం ఖాయం.

మరి నాగ చైతన్య ఈ ప్రశ్న నుండి ఎలా తప్పించు కుంటాడు అనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతుంది.

"""/" / చైతూ బృందం స్థానిక మీడియాను ఈ విషయం మ్యానేజ్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి.

అయితే స్థానిక మీడియాను మ్యానేజ్ చేసినంత ఈజీ కాదు జాతీయ మీడియాను మ్యానేజ్ చేయడం.

మరి చైతూ బృందం ఈ ప్రశ్నలు అడగకుండా జాతీయ మీడియాను కూడా మ్యానేజ్ చేయగలడా? చేయడం కష్టమే అంటున్నారు.

ఇలా జరిగితే చైతన్య నోరు విప్పక తప్పదు.చూడాలి ఏం జరుగుతుందో.

స్వాతంత్ర్యం అంటే ఇదేనా… గౌరవం ఎక్కడ ఉంది.. ఉపాసన పోస్ట్ వైరల్!