ఓటీటీలో చావుకబురు చల్లగా రిజల్ట్ ఏంటంటే..?

కరోనా, లాక్ డౌన్ వల్ల టాలీవుడ్ ప్రేక్షకులు ఓటీటీలపై ఆసక్తిని పెంచుకున్నారు.గతేడాది ఓటీటీలలో విడుదలైన పలు సినిమాలు విజయం సాధించడంతో పాటు నిర్మాతలకు కూడా భారీగా లాభాలను తెచ్చిపెట్టాయి.

యావరేజ్ కంటెంట్ తో తెరకెక్కిన సినిమాలు సైతం ఓటీటీలలో మంచి టాక్ ను సొంతం చేసుకుంటున్నాయి.

గత నెల 19వ తేదీన థియేటర్లలో విడుదలైన చావుకబురు చల్లగా ఈ నెల 23వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

ఓటీటీ కోసం చావుకబురు చల్లగా సినిమాను రీఎడిట్ చేయడం గమనార్హం.అయితే రీఎడిట్ చేసిన చావుకబురు చల్లగా ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

కేవలం 72 గంటల్లో ఈ సినిమా 100 మిలియన్ వ్యూయింగ్ మినిట్స్ ను అందుకోవడం గమనార్హం.

థియేటర్లలో ఫ్లాప్ అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో మాత్రం హిట్ కావడం గమనార్హం.

ఈ నెలలో థియేటర్లలో విడుదలైన వైల్డ్ డాగ్ థియేటర్లలో ఫ్లాప్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమా ఓటీటీలో మాత్రం రికార్డు స్థాయిలో వ్యూస్ అందుకుంటూ కొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాలో బస్తీ బాలరాజుగా స్వర్గపురి బండి డ్రైవర్ గా నటించారు.లావణ్య త్రిపాఠి భర్త చనిపోయిన నర్సు పాత్రను పోషించారు.

ఆమని, రావు రమేష్, మురళీశర్మ ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించి మెప్పించారు.

గీతాఆర్ట్స్2 బ్యానర్ పై బన్నీవాసు నిర్మాతగా ఈ సినిమా తెరకెక్కింది.చావుకబురు చల్లగా సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వస్తానని భావించిన కార్తికేయకు ఆ సినిమా భారీ షాకిచ్చింది.

లావణ్య త్రిపాఠికి కూడా ఈ సినిమా తరువాత ఆఫర్లు తగ్గాయి.డిస్ట్రిబ్యూటర్లకు ఈ సినిమా వల్ల నష్టం వచ్చినా ఓటీటీలో మాత్రం ఈ సినిమా హిట్ అనిపించుకోవడం గమనార్హం.

హాస్య చక్రవర్తికి జేజేలు… 50 ఏళ్లపాటు నవ్వులు పూయించిన మహానుబావుడు!